నేరస్తుడు
లేబుళ్లు: నేరస్తుడు, ParvathiMohanఅన్యాయమని మనసు అరుస్తున్నా,
పెగలలేని నోటికి ఎపుదోచిన్డీ మూగతనం ??
అన్నీ అందరికీ తెలిసినా అడుసులో పడుతున్న అడుగులకి,
ఎవరీచారీ చచుదనం??
ధర్మపన్నాలేన్ని తెలిసినా,
జీవన సూక్తులెన్ని చదివినా,
వినలేని, నీకేక్కదిడీ, చెవిటితనం,
అక్కున చేర్చుకు ఆడుకోవాల్సిన చేతులకి
ఆసిడ్లు చల్లి,అగ్ని రగిలించి,వలువలూడ్చి,వెటకారం చేసి ,
వికతాత్తహాసం చేసే చవట తనమేక్కడిది,?
సృష్టిలోని సమానత్వమెరిగి,
సమ సమాజ నిర్మాణం జరగాల్సిన చోట ,
మత కలహాల పేరిట ఈ మారణ కాన్దలేమిటి?
విష వలయాలు పన్ని,విజ్ఞానం,బుగ్గిచేసే ,
ఈ వికృత రూపుల విలయ తాన్దవమేమిటి,??
యత్ర నార్యంతు పూజ్యంతే అని,మొదలుపెట్టి ,
స్త్రీ ని వ్యాపారప్రకటనల వస్తువుగా మార్చి,
ఆసిడ్లతో,కత్తి,పోట్లతో,చిత్రవధ చేస్తుంటే
అవాక్కయ్యాడు దేవుడు?????
ప్రకృతిలోని,సుకుమరమంతా,రూపుదాల్చి,వచ్చిన స్త్రీని,
మనిషి,యంత్రం,కాకుండా కాపాడే మహా మంత్రమైన స్త్రీని,,
ఆటబొమ్మలా,పరిహసిస్తూ,
అబలలని,అనగాతోక్కుతున్న,పిశాచాలని చూసి,
ఇలా యంత్రంగా,పాశానంగా,
మారిన మనిషిని నేను సృష్టించలేదు,
ఈ మనిషి ముసుగేసుకున్న జంతువెవరూ,నాకు తెలియదని,
చెయ్యని నేరానికి పశ్చాతాప పడుతూ,
అవాక్కయిన అంతరంగంతో,
నేరస్తుడిలా తల వంచాడు దేవుడు!!!!!
.....................Parvathi Mohan 13.3.2010
అమ్మ ఆవేదన - పార్వతి మోహన్
లేబుళ్లు: అమ్మ ఆవేదన, ParvathiMohanనా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
ఈ కవిత అంకితం.

SATURDAY, MARCH 13, 2010
స్త్రీ జన్మ - గిరిజ నూకల
లేబుళ్లు: స్త్రీ జన్మ
జన్మ కే జన్మ నిచ్చు స్త్రీజన్మ ధన్యము
గురువుకే తొలి గురువు నీకు అభినందనలు
దాసివై మగవాడిని మహరాజు చేసినా
మంత్రివై ఆ రాజు కు సూక్ష్మ ఙ్ఞానము నేర్పినా
వెల కట్టలేని ఆలి వై ఆనందాలు పంచినా
కడుపు లోని మానవ జాతిని మోసి జాతినే అమరం చేసినా
ఊయల ఊపి జగతినేలే నాయకులని పెంచినా
ఓర్పు,నేర్పు, సహన చాతుర్యాలతో అబలవైనా సబలవై లోకాలనేలినా
నీకు నువ్వే మేటి,లేదు నీ జన్మకు సాటి
మగవాడిలో సగమైనా ఆడదానిగా నీ స్రుష్టి అపూర్వము
జన్మ జన్మల వారది మానవజాతి సారధి
బరువైన బాధ్యలతో నీ జన్మ మానవాళికి నివాళి
కష్టాలు,కన్నీళ్ళు,వేధింపులు,సా ధింపులు
కాకూడదు అవరోధము నీ జన్మ సార్ధకతకు
నిన్ను నువ్వు తెలుసుకొ,నీ విలువ పెంచుకో
తలబడి నిలబడి నీ జాతిని రక్షించుకో!
మహిళా దినోత్సవం సంధర్భంగా నాకు తోచిన నాలుగు మాటలు
నీటిరంగుల చిత్రం ఆవిష్కరణ
లేబుళ్లు: 'నీటిరంగుల చిత్రం ' ఆవిష్కరణ, చినవీరభద్రుడునా కవితాసంపుటి 'నీటిరంగుల చిత్రం ' ఆవిష్కరణ ఈ నెల 28 వతేదీ సాయంకాలం 6 గంటలకి రవీంద్రభారతి మినీ కాన్ ఫరెన్సు హాల్లో. గత కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో రాస్తూ వచ్చిన కవితల సంపుటి. నా మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం.
-----వాడ్రేవు చినవీరభద్రుడు,
రెప్పతెరిచేలోగా…
లేబుళ్లు: జాన్ హైడ్ కనుమూరి
జాన్ హైడ్ కనుమూరి
మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య” అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
ఇది
ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం
Published :
కొన్ని సమయాలు
లేబుళ్లు: కొన్ని సమయాలు
కొన్ని సమయాలను కలిగివుండటం, కొందరిని దర్శించడం బాగుంటుంది
శ్రీ మునిపల్లె రాజు గారు
శ్రీ నందివాడ భీమారావు గారు
శ్రీ సి.వి. కృష్ణారావు - శ్రీమతి సీత గార్లను దర్శించారు
శ్రీ నందివాడ భీమారావు గారు
శ్రీ సి.వి. కృష్ణారావు - శ్రీమతి సీత గార్లను దర్శించారు
గోల్డ్ న్ ధెష్రోల్డ్ - కవిసంగమం కవిత్వం పండుగ
లేబుళ్లు: గోల్డ్ న్ ధెష్రోల్డ్ - కవిసంగమం కవిత్వం పండుగ
నిన్న గోల్డ్ న్
ధెష్రోల్డ్ లో కవిసంగమం కవిత్వం పండుగ జరిగింది.
ప్రముఖ కవులందరు కవిత్వంతో కవిత్వానికి జైహో అనిపించారు,
అన్నిటికన్న ముఖ్యంగా నన్ను ఆకర్షించింది రైయిన్ బో హోం మేడి బావి చిన్నారులు,ప్రముఖ
కవయిత్రి విమలగారి సలహతో పుస్తకాలు ఆవిష్కరిండం,కవితలు రాయడం బొమ్మలు వేయడం కవిత్వానికి ఇంతకన్నా పండుగ ఏముంది అనిపించింది,
అచిన్నారులు శ్రద్ధగా ఓ పక్కగా కూర్చుని అందరికవిత్వం విన్నారు, వీళ్ళనుంచి
నేర్చుకోవలసింది చాలా వుంది అనిపించింది,ప్రముఖ కవి
శివారేడ్డిగారు అన్నట్లు ...అందరి దగ్గరనుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి జీవితంలో నేర్చుకోవడానికి
ఏమి లేకపోతే ఖాళిగా మిగిపోతామేమో?
గుజరాత్ దగ్గరనుంచి భారతదేశంలో ఏమూల నుంచి కవిత్వాన్ని అర్దం
చేసుకున్నా కవిత్వాని ఒకటే భాష మనసుపోరలలోనుంచీ మాట్లాడం, కవిని కలుసుకుని కవిత్వంతో మాట్లాడుకుందాం
ప్రో.శీతాంషు యశశ్చంద్ర
గారితోమాట్లాడినప్పుడు కూడా ఇలాగే అనిపించింది
భాషఏదైనా భావం ఒక్కటే కవిత్వం,కవిత్వం..
నేలమీద కాలు ఆనితేనే భూమితడి ,నేలపగుళ్ళు,తెలుస్తాయి గోరటివెంకన్న గారి దగ్గరనుంచి పల్లే మట్టి వాసనని అనుభవించిన నిన్నటి సాయంకాలం ఓ అద్భుతం పాటలు పల్లేని మోసుకొచ్చాయి ఎన్ని సార్లు విన్న కొత్తగా మళ్ళీ వినాలనిపించేఆపాటలకి
మళ్ళీ మరోసారి కవిత్వానికి జైహో....
.రేణుక అయోల
వాడ్రేవు చినవీరభద్రుడు - జాన్ హైడ్ కనుమూరి - పద్యం
లేబుళ్లు: జాన్ హైడ్ కనుమూరి, వాడ్రేవు చినవీరభద్రుడు
వాడ్రేవు చినవీరభద్రుడు పద్యం
తెల్లవారు జామునే నువ్వొక బల్లముందు కూచుంటావు,పక్షి ఈక ఒకటి
బంగారు రంగుది,గాల్లో ఎగురుకుంటూ యూకలిప్టస్ కొమ్మలమీద వాలే
దృశ్యం, తూలికాతుల్యమైన ఆ బరువుకి చెట్టంతా నునులేత తిమ్మిరి,
ఆమె నడుముచుట్టూ కొనవేళ్ళతో నువ్వు మీటుకునే సంగీతం లాంటిది.
వాళ్ళు రోజంతా ప్రభుత్వం కోసం పథకాలు రచిస్తుంటారు, ప్రజల కోసం
కాదు, అక్కడ నీకు ఊపిరాడదు, బయటకి చూస్తావు, రొప్పుతున్న
నగరం నీ మీద చిమ్ముతున్న సిమెంటునురగ. పార్కు గోడలమీద
ఒలికిన ఆకుపచ్చనిరంగుతో నీ మరకలు తుడుచుకోవాలనుకుంటావు.
రాత్రవుతుంది, ఒక గుడ్డతో ఆకాశాన్ని శుభ్రంగా తుడిచి బల్లమీద
చంద్రుణ్ణి తెచ్చి పెడతారు, పక్కన అద్దంలాగా చిన్ని మేఘమొకటి,
ఒక్కసారిగా నీ సౌందర్యం నీకు స్ఫురణకొస్తుంది, కవి చెప్పినట్టు
ప్రతి రాత్రీ వసంతరాత్రి కావాలనిపిస్తుంది, నీకు బతకాలనిపిస్తుంది

జాన్ హైడ్ కనుమూరి - పద్యం
తెల్లవారు జామున బల్లముందుకూర్చొని రాత్రి రాలిన మంచు
బిందువుల్ని ఏరుతుంటాను. పక్షులు విదిల్చే కువకువల్ని వింటూనే
అనంత నముద్రాలపై పయనిస్తుంటాను. ఎవరిదో రాత్రి తడిసిన దిండు,
పించమై పురివిప్పిన అక్షరాల మధ్య రంగులు వెదకుతుంటాను
కూజాలోంచి వంపుకున్న నీళ్ళు గొంతులో చల్లగా జారుతూ
ఎప్పుడో తడిసిన వెన్నెలవానను జ్ఞప్తికి తెస్తుంది. అక్కడో వృద్దుడు
తంత్రులను సరిచెయ్యాలని ఆత్రపడతాడు. తిరిగొచ్చేవారికోసం
కొత్త రాగాన్ని శృతిచేస్తుంటాడు. నింపడానికి నాదగ్గరేసంచీ వుండదు.
నా కోసం తీసుకొచ్చిన పలుకులేమనా వున్నాయా యని
వెదకుతుంటాను. ఎట్నుంచే ఎగిరిపడ్డ నెమలీకొకటి నన్ను
పట్టి వివశుణ్ణి చేస్తుంది. ఒక చిర్నవ్వు మనసుకో, ముఖానికో
పులుముకున్నాననుకొనేలోగా విద్యుత్తు దారితప్పుతుంది.
తెరచుకున్న గుమ్మంముందు ప్యాకెట్టులో ఒదిగిన పాలు
పలకరిస్తాయి. ఇక శబ్దం ఒకొక్కటిగా లోనికి చేరుతుంది.
పరుగులన్నీ తొందరచేస్తాయి. అలుపు, నిద్రలను దులుపి
మళ్ళీ బల్లముందు కూర్చునే వరకు ఏదీ గుర్తుండదు.

రేణుక అయోల కవిత
లేబుళ్లు: కవితలు, నెలనెలా వెన్నెల, రేణుక అయోల కవిత
|
కృష్ణారావు గారు కోలు కుంటున్నారు
కృష్ణారావు గారు కోలు కుంటున్నారు
చైతన్యపురి ఇంటినుండి మారారు
పాత ఇల్లు ఆస్మాన్ ఘడ్ ఇంటిలోనే ఉండబోతున్నారు
ఫోను నంబరు : 040-24069599
శ్రీ సి. వి. క్రష్ణారావుకోలు కుంటున్నారు
లేబుళ్లు: సి.వి కృష్ణారావు
శ్రీ సి. వి. క్రష్ణారావు గారి కాలికి ఆపరేషన్ పూర్తయ్యింది.
కొంచెం కొంచెంగా కోలు కుంటున్నారు.
బహుశ రేపు (౨౬.౦౨.౨౦౧౨) డిశ్చార్జి చేస్తారు.
ఆసమాన్ ఘడ్ లోని పార్వతి మోహన్ (కుమార్తె) ఇంటివద్ద వుంటారు.
త్వరగా కోలుకోవాలని ఆ దేవునికి వేడుకుంటున్నాను.
వివరాలకు
౩౭౦౫౧౪౮౦౦౬ 0 కామెంట్‌లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శనివారం, ఫిబ్రవరి 25, 2012

శ్రీ సి.వి. కృష్ణా రావు గారు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారని తెలిసింది
ఇంటిలో పడిపోవటంవల్ల కాలు విరిగి శస్త్రచికిత్స అవసరమని తెలిసింది.
ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
ఆసుపత్రివివరాలు త్వరలో తెలియచేస్తాను.
Operation will be on 22.02.2012
at Omini Hospital, Kothapata
వివరాలకోసం వారి కుమార్తె శ్రీమతి పార్వతీమోహన్ ను సంప్రదించవచ్చు
040-24069599
+91 9705148006
-------------
జాన్ హైడ్ కనుమూరి
+9912159531 0 కామెంట్‌లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, ఫిబ్రవరి 22, 2012
నెలనెలా వెన్నెల - జనవరి 2012
లేబుళ్లు: నెలనెలా వెన్నెల, సమావేశాలు, సి.వి కృష్ణారావు
పార్వతి మోహన్ (సి.వి.కే. కుమార్తె), రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు
రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు శ్రీమతి సీత (శ్రీ సి.వి. క్రష్ణా రావు,గారి భార్య )
రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు శ్రీమతి సీత (శ్రీ సి.వి. క్రష్ణా రావు,గారి భార్య )
పార్వతి మోహన్ (సి.వి.కే. కుమార్తె), రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు

శ్రీ సి.వి. క్రష్ణా రావు, శ్రీ గుడిపాటి, శ్రీ నాళేశ్వరం శంకరం

డేట్ లైన్: హైదరాబాద్, 2010 హెచ్ ఆర్. కే
లేబుళ్లు: కవిత్వం, నెలనెలా వెన్నెల, సాహిత్యం, సి.వి కృష్ణారావురేగుపండ్లు ఎక్కడైనా ఉంటాయి,
టుంకిపండ్లు కూడా.
జొన్న రొట్టెలు, వెన్నముద్దలు,
ఒళ్లో పాపాయిలతో అమ్మలు
ఎక్కడైనా ఉంటారు.
అమ్మ, నాన్న, ఏరు, ఊరు మాటలు వున్న చోట్ల
అమ్మ, నాన్న, ఏరు, ఊరు ఉంటాయనుకుంటాం.
ఎవరెవరో అమ్మలతో, నాన్నలతో, ఏళ్లతో, వూళ్లతో
ఉండిపోతాం.
చెమటలో చెమట నెత్తుటిలో నెత్తురు అయిపోతాం.
నిజమే,
ఇసుకలలో మా మద్దిలేటి వాగు ఇసుక వేరు.
నిన్న మా ఊరికి వెళ్లొచ్చాను.
అక్కడ నేనెరిగిన వాళ్లెవరూ లేరు.
ఇసుక అసలే లేదు.
కాలం కూడా స్థలం వంటిదేనని తెలిసి వచ్చింది.
ఒక్కుమ్మడిగా వరదలెత్తిన స్థలాల్ని వదిలి
కాలం చెట్టు మీద గూళ్లు కట్టుకున్న వాళ్లం,
ఒకే సమయం కొమ్మల మీద బతుకుతున్న వాళ్లం
కాలాన్ని కొలతలు వేసి పంచుకోగలమా?
...........................నెలనెలా వెన్నెల సంకలనం ౫లోని హెచ్.ఆర్.కే. కవిత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)