RSS

అమ్మ ఆవేదన - ParvathiMohan


 


నా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
కవిత అంకితం.

0 కామెంట్‌లు

పాపం--పిల్లనగ్రోవి

వెదురుకు తెలియదు తనలో చేరిన ఊపిరి ,

ప్రాణం పోసుకుని నాదమై వెలువడుతుందని,,,

జగన్నాటక రంగంలో పాత్ర ధారినావుతానని,

వూపిరున్నంత సేపే తానూ మురళినని,,

అది లేక తానుత్త ,,వేడురునేనని !!


పలికించిన కొన్ని నాదలతోనైన ,అనుభూతులెన్నో పొంది,,

మహాభాగ్యంగా పదిలంగా దాచుకుంటూ

మాయా మోహంలో పడి ముచ్చట పడుతూంది,,

పాపం మురళికి తెలియదు,,తానుత వెదురుబడ్డ నేనని,,!!


కేరుమన్న ఏడుపుతో, ఆడిన శ్వాస ,

గంభీర నిశబ్దాన్ని చేరేదాక,

తపనతో ఆగని ఆరాటం జీవితం!!

శీతల పవనాల కూర్వలేక ఉన్ని నాశ్రయించే కోమల దేహం,


మంచుముక్కలపై ఎట్లు పరున్దేనో,,

వేడి గాడ్పులకే వదలేటి దేహం,

చితి మంటల సేగాలనేట్లోర్చేనో,,

పరుల కలతలకే కన్నీరోలికే ఆర్ద్రత తన వారి శోకమేట్లోర్చేనో,,

విధి కదా వింత సృష్టిలో,

మృత్యువే కదా వరం జన్మలో!!

0 కామెంట్‌లు

నేరస్తుడు


అన్యాయమని మనసు అరుస్తున్నా,
పెగలలేని నోటికి ఎపుదోచిన్డీ మూగతనం ??
అన్నీ అందరికీ తెలిసినా అడుసులో పడుతున్న అడుగులకి,
ఎవరీచారీ చచుదనం??
ధర్మపన్నాలేన్ని తెలిసినా,
జీవన సూక్తులెన్ని చదివినా,
వినలేని, నీకేక్కదిడీ, చెవిటితనం,
అక్కున చేర్చుకు ఆడుకోవాల్సిన చేతులకి
 
ఆసిడ్లు చల్లి,అగ్ని రగిలించి,వలువలూడ్చి,వెటకారం చేసి ,
వికతాత్తహాసం చేసే చవట తనమేక్కడిది,?
సృష్టిలోని సమానత్వమెరిగి,
సమ సమాజ నిర్మాణం జరగాల్సిన చోట ,
మత కలహాల పేరిట ఈ మారణ కాన్దలేమిటి?
విష వలయాలు పన్ని,విజ్ఞానం,బుగ్గిచేసే ,
ఈ వికృత రూపుల విలయ తాన్దవమేమిటి,??
యత్ర నార్యంతు పూజ్యంతే అని,మొదలుపెట్టి ,
స్త్రీ ని వ్యాపారప్రకటనల వస్తువుగా మార్చి,
ఆసిడ్లతో,కత్తి,పోట్లతో,చిత్రవధ చేస్తుంటే
 
అవాక్కయ్యాడు దేవుడు?????
ప్రకృతిలోని,సుకుమరమంతా,రూపుదాల్చి,వచ్చిన స్త్రీని,
మనిషి,యంత్రం,కాకుండా కాపాడే మహా మంత్రమైన స్త్రీని,,
ఆటబొమ్మలా,పరిహసిస్తూ,
అబలలని,అనగాతోక్కుతున్న,పిశాచాలని చూసి,

ఇలా యంత్రంగా,పాశానంగా,
మారిన మనిషిని నేను సృష్టించలేదు,
ఈ మనిషి ముసుగేసుకున్న జంతువెవరూ,నాకు తెలియదని,
చెయ్యని నేరానికి పశ్చాతాప పడుతూ,
అవాక్కయిన అంతరంగంతో,
నేరస్తుడిలా తల వంచాడు దేవుడు!!!!!


.....................Parvathi Mohan 13.3.2010
1 కామెంట్‌లు

అమ్మ ఆవేదన - పార్వతి మోహన్




నా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,

అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
ఈ కవిత అంకితం.


SATURDAY, MARCH 13, 2010


0 కామెంట్‌లు

స్త్రీ జన్మ - గిరిజ నూకల



జన్మ కే జన్మ నిచ్చు స్త్రీజన్మ ధన్యము
గురువుకే తొలి గురువు నీకు అభినందనలు

దాసివై మగవాడిని మహరాజు చేసినా
మంత్రివై ఆ రాజు కు సూక్ష్మ ఙ్ఞానము నేర్పినా
వెల కట్టలేని ఆలి వై ఆనందాలు పంచినా
కడుపు లోని మానవ జాతిని మోసి జాతినే అమరం చేసినా
ఊయల ఊపి జగతినేలే నాయకులని పెంచినా
ఓర్పు,నేర్పు, సహన చాతుర్యాలతో అబలవైనా సబలవై లోకాలనేలినా
నీకు నువ్వే మేటి,లేదు నీ జన్మకు సాటి

మగవాడిలో సగమైనా ఆడదానిగా నీ స్రుష్టి అపూర్వము
జన్మ జన్మల వారది మానవజాతి సారధి
బరువైన బాధ్యలతో నీ జన్మ మానవాళికి నివాళి

కష్టాలు,కన్నీళ్ళు,వేధింపులు,సాధింపులు
కాకూడదు అవరోధము నీ జన్మ సార్ధకతకు
నిన్ను నువ్వు తెలుసుకొ,నీ విలువ పెంచుకో
తలబడి నిలబడి నీ జాతిని రక్షించుకో!

మహిళా దినోత్సవం సంధర్భంగా నాకు తోచిన నాలుగు మాటలు
0 కామెంట్‌లు

నీటిరంగుల చిత్రం ఆవిష్కరణ





నా కవితాసంపుటి 'నీటిరంగుల చిత్రం ' ఆవిష్కరణ ఈ నెల 28 వతేదీ సాయంకాలం 6 గంటలకి రవీంద్రభారతి మినీ కాన్ ఫరెన్సు హాల్లో. గత కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో రాస్తూ వచ్చిన కవితల సంపుటి. నా  మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం.

-----వాడ్రేవు చినవీరభద్రుడు, 
1 కామెంట్‌లు

రెప్పతెరిచేలోగా…



 
జాన్ హైడ్ కనుమూరి
మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ  మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య”  అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
                                          ఇది ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం         

Published :



1 కామెంట్‌లు

కొన్ని సమయాలు

కొన్ని సమయాలను కలిగివుండటం, కొందరిని దర్శించడం బాగుంటుంది
 
శ్రీ మునిపల్లె రాజు గారు
శ్రీ నందివాడ భీమారావు గారు
శ్రీ సి.వి. కృష్ణారావు - శ్రీమతి సీత గార్లను దర్శించారు 


0 కామెంట్‌లు

గోల్డ్ న్ ధెష్రోల్డ్ - కవిసంగమం కవిత్వం పండుగ



నిన్న గోల్డ్ న్ ధెష్రోల్డ్ లో కవిసంగమం కవిత్వం పండుగ జరిగింది.

ప్రముఖ కవులందరు కవిత్వంతో కవిత్వానికి జైహో అనిపించారు,  


అన్నిటికన్న ముఖ్యంగా నన్ను ఆకర్షించింది రైయిన్ బో హోం మేడి బావి చిన్నారులు,ప్రముఖ కవయిత్రి విమలగారి సలహతో పుస్తకాలు ఆవిష్కరిండం,కవితలు రాయడం బొమ్మలు వేయడం కవిత్వానికి ఇంతకన్నా పండుగ ఏముంది అనిపించింది, అచిన్నారులు శ్రద్ధగా ఓ పక్కగా కూర్చుని అందరికవిత్వం విన్నారు, వీళ్ళనుంచి నేర్చుకోవలసింది చాలా వుంది అనిపించింది,ప్రముఖ కవి శివారేడ్డిగారు అన్నట్లు ...అందరి దగ్గరనుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి జీవితంలో నేర్చుకోవడానికి ఏమి లేకపోతే ఖాళిగా మిగిపోతామేమో?
 

గుజరాత్ దగ్గరనుంచి భారతదేశంలో ఏమూల నుంచి కవిత్వాన్ని అర్దం చేసుకున్నా కవిత్వాని ఒకటే భాష మనసుపోరలలోనుంచీ మాట్లాడం, కవిని కలుసుకుని కవిత్వంతో మాట్లాడుకుందాం

 ప్రో.శీతాంషు యశశ్చంద్ర గారితోమాట్లాడినప్పుడు కూడా ఇలాగే అనిపించింది
 
భాషఏదైనా భావం ఒక్కటే కవిత్వం,కవిత్వం..

నేలమీద కాలు ఆనితేనే భూమితడి ,నేలపగుళ్ళు,తెలుస్తాయి గోరటివెంకన్న గారి దగ్గరనుంచి పల్లే మట్టి వాసనని అనుభవించిన నిన్నటి సాయంకాలం ఓ అద్భుతం పాటలు పల్లేని మోసుకొచ్చాయి ఎన్ని సార్లు విన్న కొత్తగా మళ్ళీ వినాలనిపించేఆపాటలకి
మళ్ళీ మరోసారి కవిత్వానికి జైహో....                


       
.రేణుక అయోల 

1 కామెంట్‌లు