RSS

జనవరి నెల సమావేశ విశేషాలు

ఫ&#
2010
31.1.2010 ఆదివారము సాయంత్రం జరిగింది
హాజరైన వారు
శ్రీ ఒబ్బిని సన్యాసిరావు
శ్రీ ధర్మాచారి
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి దావులూరి విజయలక్ష్మి
శ్రీమతి రేణుకా అయోలా
శ్రీమతి శిలాలోలిత
శ్రీ యాకూబ్
శ్రీమతి పార్వతీ మోహన్

స్వీయ కవితా పఠనము ఓబ్బిని తో మొదలయ్యి, ధర్మాచారి గల్పికలు, శిలాలోలిత, రేణుకా అయోలా, జాన్ హైడ్ కనుమూరి కవిత్వాన్ని చదివారు.
యాకూబ్ తన కొత్త సంపుటినుండి కొన్ని కవితలను వినిపించి అందరికి అందజేసారు.
డావులూరి విజయలక్ష్మి తన కథల పుస్తకాన్ని అందించారు.
నెల నెలా వెన్నెల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను, విశేషాలను ఉటంకిస్తూ పార్వతీ మోహన్ రాసిన వ్యాసాన్ని, యాకూబ్ చదివి వినిపించారు. అది త్వరలో బ్లాగులో రానుంది మరిఉ సంకలనంలో రానుంది. ఆ వ్యాసంలోని పలువురు వ్యక్తుల పేర్లు వింటున్నప్పుడు వారిగురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కొందరు. కోదరు మన మద్యలేరు అనే జ్ఞప్తి కొచెం బాదించినా వ్యాసంగా రావటం సాహిత్య నికి అవసరం ఎంతానావుందని అందరూ అభిప్రాయపడ్డారు.
నెలనెలా వెన్నెల అనేక సాయంకాలల పేరుతో ఇప్పటివర్కూ నాలుగు సంకలనాలు వెలువడ్డాయి. ఐదవ సంకలనకోసం చేస్తున్న ప్రయత్నాలగురించి చర్చించారు.
యాకూబ్ తనవంతు సహకారాన్నివ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన కవితలను, ఇంకా రావలసిన వాటికోసం మిత్రులతో మాట్లాడలని అనుకున్నారు.
బ్లాగు విషయాలను జాన్ హైడ్ తనవంతు సహకారాన్ని ఇవ్వడంకోసం ముందుంటానన్నారు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Eagerly waiting for posts

Apoorva

అజ్ఞాత చెప్పారు...

ఎనభైయవ దశకంలో కాకినాడలో నెల నెలా వెన్నెల పేరుతో జరిగే సాహితీసమావేశాలకు ఇస్మాయిల్ వచ్చేవారు. సమావేశమంతా అన్ని గంటలూ మౌనంగా ఉండే ఆయన, మధ్యలో జేబులోంచి ఒక తెల్లటి కాగితం మడత విప్పి ఒక కవిత చదివి వినిపించేవారు. ఆ కవితను రెండవ సారి కూడా చదివేవారు కాదు. ఆ సభలో ఆయన పార్టిసిపేషను అంతే. కానీ చివరిదాకా అలా అందరి కబుర్లనూ ఆస్వాదిస్తూ ఉండేవారు. – వాడ్రేవు వీర లక్ష్మీ దేవి
ఇస్మాయిల్ కవిత్వం, కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు http://pustakam.net/?p=2021&page=2