RSS

జ్వర సంధి ..............మునిపల్లె రాజు

ఆగస
2011
జ్వరం నాకొక వరం
అది నా స్వగతాల స్వరం
జ్వరం నా జనని వడి
సడిచేయని వెచ్చని నది

అనాది స్వప్నాల నక్షత్ర యాత్రలను
దేహంవీడి దైన్యంగా పయనిస్తున్న ఆత్మకు
ఎన్నో పురో భయాల పాంద్రతర చిత్రాలను
రంగులు మారుతున్న ఉష్ణరక్త ప్రస్థానాన్ని

జ్వరసంధిలో తిలకిస్తుంటాను
ఎన్నడూ వినని భాషలో కవితలల్లుతుంటాను

చీలిన పొగమంచు తెరల రధ్యల్లో
జయ జయ మృదంగ నాద నేపధ్యంతో
ఏడుతరాల నా పూర్వికుల దర్శనం
ఆశువుగా ఆశాదుల ఆశః పరంపర
ఆకలి దప్పులు లేని ఆనంద మఠ విశ్రాంతి

జ్వరంలో నాకు సాధ్యం
యోగనిద్రకు అదే నా భాష్యం
......................................................నెలనెలా వెన్నెల-5 సంకలనం నుంచి

2 కామెంట్‌లు:

Nutakki Raghavendra Rao చెప్పారు...

జ్వరవేదనలో కవితా భావనలు
ఒక్క మునిపల్లె రాజు గారికే చెల్లింది
అద్భుతం ..నూతక్కి

నెలనెలావెన్నెల చెప్పారు...

dhanyavaadaalu