RSS

కృష్ణారావు గారు కోలు కుంటున్నారు

కృష్ణారావు గారు కోలు కుంటున్నారు

చైతన్యపురి ఇంటినుండి మారారు

పాత ఇల్లు ఆస్మాన్ ఘడ్ ఇంటిలోనే ఉండబోతున్నారు

ఫోను నంబరు : 040-24069599
6 కామెంట్‌లు

శ్రీ సి. వి. క్రష్ణారావుకోలు కుంటున్నారు

శ్రీ సి. వి. క్రష్ణారావు గారి కాలికి ఆపరేషన్ పూర్తయ్యింది.

కొంచెం కొంచెంగా కోలు కుంటున్నారు.

బహుశ రేపు (౨౬.౦౨.౨౦౧౨) డిశ్చార్జి చేస్తారు.

ఆసమాన్ ఘడ్ లోని పార్వతి మోహన్ (కుమార్తె) ఇంటివద్ద వుంటారు.

త్వరగా కోలుకోవాలని ఆ దేవునికి వేడుకుంటున్నాను.

వివరాలకు

౩౭౦౫౧౪౮౦౦౬ 0 కామెంట్‌లు

శ్రీ సి.వి. కృష్ణా రావు గారు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారని తెలిసింది


శ్రీ సి.వి. కృష్ణా రావు గారు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారని తెలిసింది




ఇంటిలో పడిపోవటంవల్ల కాలు విరిగి శస్త్రచికిత్స అవసరమని తెలిసింది.



ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను



ఆసుపత్రివివరాలు త్వరలో తెలియచేస్తాను.
Operation will be on 22.02.2012
at Omini Hospital, Kothapata


వివరాలకోసం వారి కుమార్తె శ్రీమతి పార్వతీమోహన్ ను సంప్రదించవచ్చు



040-24069599


+91 9705148006




-------------
జాన్ హైడ్ కనుమూరి
+9912159531 0 కామెంట్‌లు

ఆహ్వానము



1 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల - జనవరి 2012


పార్వతి మోహన్ (సి.వి.కే. కుమార్తె), రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు

రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు శ్రీమతి సీత (శ్రీ సి.వి. క్రష్ణా రావు,గారి భార్య )
రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు శ్రీమతి సీత (శ్రీ సి.వి. క్రష్ణా రావు,గారి భార్య )


పార్వతి మోహన్ (సి.వి.కే. కుమార్తె), రూప్ కుమార్ డబ్బికార్, శ్రీ సి.వి. క్రష్ణా రావు




















శ్రీ సి.వి. క్రష్ణా రావు, శ్రీ గుడిపాటి, శ్రీ నాళేశ్వరం శంకరం






































































2 కామెంట్‌లు

డేట్‍ లైన్: హైదరాబాద్, 2010 హెచ్ ఆర్. కే















రేగుపండ్లు ఎక్కడైనా ఉంటాయి,

టుంకిపండ్లు కూడా.

జొన్న రొట్టెలు, వెన్నముద్దలు,

ఒళ్లో పాపాయిలతో అమ్మలు

ఎక్కడైనా ఉంటారు.

అమ్మ, నాన్న, ఏరు, ఊరు మాటలు వున్న చోట్ల

అమ్మ, నాన్న, ఏరు, ఊరు ఉంటాయనుకుంటాం.

ఎవరెవరో అమ్మలతో, నాన్నలతో, ఏళ్లతో, వూళ్లతో

ఉండిపోతాం.

చెమటలో చెమట నెత్తుటిలో నెత్తురు అయిపోతాం.

నిజమే,

ఇసుకలలో మా మద్దిలేటి వాగు ఇసుక వేరు.

నిన్న మా ఊరికి వెళ్లొచ్చాను.

అక్కడ నేనెరిగిన వాళ్లెవరూ లేరు.

ఇసుక అసలే లేదు.

కాలం కూడా స్థలం వంటిదేనని తెలిసి వచ్చింది.

ఒక్కుమ్మడిగా వరదలెత్తిన స్థలాల్ని వదిలి

కాలం చెట్టు మీద గూళ్లు కట్టుకున్న వాళ్లం,

ఒకే సమయం కొమ్మల మీద బతుకుతున్న వాళ్లం

కాలాన్ని కొలతలు వేసి పంచుకోగలమా?




...........................నెలనెలా వెన్నెల సంకలనం ౫లోని హెచ్.ఆర్.కే. కవిత

0 కామెంట్‌లు

నేలనేలావేన్నెలనెలనెలావెన్నెల - నవంబరు2011 సమావేశము

27.11.2011 ఆదివారము సాయంత్రం
-------------------------------------------

పది సంవత్సరాలలో కవిత్వము అనే అంశముపై శ్రీ ద్వానా శాస్త్రి మాట్లాడారు.
ఈ కాలంలో జరిగిన మార్పులు, ఉద్యమాలు , కవిత్వ పరిస్థితులను విశ్లేషించారు

శ్రీ సి.వి. కృష్ణారావు
శ్రీ సుబ్బారవు
శ్రీ ధర్మాచారి
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీ కె.వి. రామానాయుడు
శ్రీమతి పార్వతీమోహన్
.......................................హారైయినారు



3508
0 కామెంట్‌లు

అనేక సాయంకాలాలు

నెలనెలా వెన్నెల
అనేక సాయంకాలాలు ఆవిష్కరణ















0 కామెంట్‌లు

డిసెంబరు నెలనెలా వెన్నెల Dec 29, 2008

చాలా కాలంగా బ్లాగు సరిగా రాయలేకపోతున్నాను.
చాలా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను. రకరకాల కారణలు.

పుస్తక ప్రదర్శనకని బయలుదేరాను, కానీ వెళ్ళలేకపోయా. చివరికి నెలనెలా వెన్నెలకు హాజరయ్యాను. దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి, న్యూ మారుతి నగర్ లో జరుగుతుంది. ఇదివరలో ఆస్మాన్ ఘడ్‌లో జరిగేది. రోడ్డుకు కొంచెం దగ్గరగావుండేది. అయినా రామచంద్రపురంనుండి వెళ్ళే నాకు దగ్గరేమిటి దూరం ఏమిటి. నేను వెళ్ళే సరికి కొంతమంది అప్పటికే వచ్చివున్నారు. ఒబ్బిని, ధర్మాచారి, నాగార్జున, కె.వి. రామానాయుడు, మొహనరెడ్డి, వారి మిత్రుడు, ప్రార్వతిమోహన్, లలితకుమారి శిలాలోలిత ఇలా.

పలకరింపులు అయ్యాక ఈ మద్య కాలంలో మనల్ని వదిలిపెట్టివెళ్ళిన సాహితీమిత్రుల్ని ఒక్కసారి గుర్తు చెసుకుంటూ మౌనం పాటించారు. ఒబ్బిని తన కవిత్వ పఠనాన్ని ప్రారంబించారు. ఇంతలో ఇంద్ర ప్రసాద్, మరికొద్దిసేపటికి అద్దేపల్లి రామ్మొహన రావు వచ్చారు. అద్దేపల్లి జ్వాలముఖితో వున్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు,

ఎప్పటిలాగే తన శ్రీకాకుళపు మాండలీకంతో విరుపుల, రాజశేఖరీయం అనే గల్పికను చదివి వినిపించారు.

శిలాలోలిత ఈమద్యకాలంలో దూరమౌతున్న సాహితీ మిత్రులను తలపోస్తూ ఏమైపోతున్నారు వీరంతా అంటూనే ......

ఈ మద్య తనకు ఆకాశవాణి జాతీయంగా ఎన్నుకున్న కవితను చదివి వినిపించారు.

వాళ్ళంతా దేహాన్ని విడిచారు
రాలిపడ్డ పూలల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమికరించుకుంటూ
దేహం అశశ్వతమని
అక్షరాల పూలే శాశ్వతమని చేదు గుళికలు మింగుతూ
రూప రహితులైన వారి జ్ఞాపకాలను
చమర్చుతున్న కన్నీళ్ళను అదిమిపడ్తూ ఆర్దత పొలమారుతుంటే
వాళ్ళ అక్షరాల వూత కర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం!

మరోకవితలోని కొన్ని పాదాలు
" బ్రతుకు కంటే స్వేచ్చ గొప్పది
స్వేచ్చంటే బాధను చుట్టుకున్న పొర చేదింపబటమే" అంటారు

మోహన రెడ్డిగారు తనకవితను వినిపించారు.
అద్దేపల్లిగారితో వచ్చిన ఆయన శిష్యుడు స్వియరచనా పాటలని పాడివినిపించారు.

నడిచే పుస్తంకగా మేము పిలుచుకొనే రామనాయుడు కొన్ని కవితలను, దిగంబర కవిత్వంలో తనకు బాగా గుర్తున్న వాక్యాలను వినిపించారు

అన్నా!
నీ గాయాలపైనుండి వీచిన గాలి ఎరుపెక్కింది
నువ్వు ఆసరాచేసుకున్న బొడ్డుమల్లె ఎరుపెక్కింది
నువ్వు పడ్డచోట భూమి కూడా ఎరుపెక్కింది
ఇంకో మాట విన్నావా
నువ్వు కొట్టిన బాణం దెబ్బకు గాలికూడా ఎరుపెక్కింది

ఇక నావంతు వచ్చేసరికి నాదగ్గార నేను రాసినవి ఏమిలేకపోవడంవల్ల, ఈ మద్యకాలంలో నాకు నచ్చిన "పొద్దు" లో వచ్చిన చదరంగం - ఒరెమునా(చావా కిరణ్) అనే కవితను చదివి వినిపించాను.

మరో ఉదయం అస్తమించింది,
రాతిరి చీకటిని తలుచుకుంటూ
కన్నీటి ప్రవాహం సాక్షిగా,
యద రోదన సాక్షిగా,
నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,
నిజ శరీర సాక్షిగా


మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలుచుకుంటూ.
తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,
విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,
అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,
ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,

మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలచుకుంటూ.
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
నవ్వుల జల్లుల సాక్షిగా,
యద కేరింతల సాక్షిగా,
ఆనంద, మాధుర్య, సగర్వ,
సమ్మోహ స్వ శరీర సాక్షిగా



మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,
దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,
సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,
వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,
మరో ఉదయాగమనం.
రాతిరి పరిమళాలతో.

జీవితం ఎప్పుడూ ఇంతే,
ఒక కిటికీలో మోయలేని విషాదం
ఒక కిటికీలో భరించలేని ఆనందం."

ఇక లలితకుమారిగారు బాల సాయిబాబాపై రాసిన భక్తి పద్యాలను వినిపించారు, ముద్రితమైన పుస్తకాన్ని అందరికి పంచారు. చివరిగా అద్దేపల్లి ప్రెష్‌ష్ష్...........
కురగాయలు బహుళ కంపెనీలుగా మారిపోవడన్ని వినిపించారు.

తేనీరు సేవించి అందర్మూ ఒకరికొకరు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ శెలవు తీసుకున్నాము. బహుముఖాలుగా సాగిన ఈ సాహిత్య సాయంకాలం సుమహారంగా మారింది.

నిర్వహించిన సి.వి.కృష్ణారావుగారి మోములో కొత్త నందివర్దనం విరిసింది
........జాన్ హైడే కనుమూరి 3 కామెంట్‌లు

వార్తలో వ్యాసం ౨౮.౮.౨౦౧౧


నెలనెలా వెన్నెల 5 సంకలనం పై వార్తలో వ్యాసం

0 కామెంట్‌లు

జ్వర సంధి ..............మునిపల్లె రాజు

జ్వరం నాకొక వరం
అది నా స్వగతాల స్వరం
జ్వరం నా జనని వడి
సడిచేయని వెచ్చని నది

అనాది స్వప్నాల నక్షత్ర యాత్రలను
దేహంవీడి దైన్యంగా పయనిస్తున్న ఆత్మకు
ఎన్నో పురో భయాల పాంద్రతర చిత్రాలను
రంగులు మారుతున్న ఉష్ణరక్త ప్రస్థానాన్ని

జ్వరసంధిలో తిలకిస్తుంటాను
ఎన్నడూ వినని భాషలో కవితలల్లుతుంటాను

చీలిన పొగమంచు తెరల రధ్యల్లో
జయ జయ మృదంగ నాద నేపధ్యంతో
ఏడుతరాల నా పూర్వికుల దర్శనం
ఆశువుగా ఆశాదుల ఆశః పరంపర
ఆకలి దప్పులు లేని ఆనంద మఠ విశ్రాంతి

జ్వరంలో నాకు సాధ్యం
యోగనిద్రకు అదే నా భాష్యం
......................................................నెలనెలా వెన్నెల-5 సంకలనం నుంచి
2 కామెంట్‌లు

నెలనెలావెన్నెల సమావేశం

నెలనెలావెన్నెల సమావేశం ఆదివారము 31.7.2011 సాయత్రం జరిగింది.

శ్రీ రూప్కుమార్

శ్రీ ధర్మాచారి

శ్రీ కుమార్

శ్రీ బ్రహ్మానందం

శ్రీ కె.వి రామానాయుడు

శ్రీమతి పార్వతీమోహన్ హాజరయ్యారు

శ్రీ సి.వి.కృష్ణారావు గారు అందరిని పరిచయం చేసారు


నాగేశ్వర రావు గారు విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్యుడు.
కొన్ని అనుభవాలను, కొన్ని పద్యాలను పంచుకున్నారు.

ఆందరూ తమ తమ కవితల్ని పఠనం చేసారు.

.......................శ్రీమతి పార్వతీమోహన్
0 కామెంట్‌లు