డిసెంబరు నెలనెలా వెన్నెల Dec 29, 2008
లేబుళ్లు: కవిత్వం, నెలనెలా వెన్నెల, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుచాలా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను. రకరకాల కారణలు.
పుస్తక ప్రదర్శనకని బయలుదేరాను, కానీ వెళ్ళలేకపోయా. చివరికి నెలనెలా వెన్నెలకు హాజరయ్యాను. దిల్షుక్నగర్, చైతన్యపురి, న్యూ మారుతి నగర్ లో జరుగుతుంది. ఇదివరలో ఆస్మాన్ ఘడ్లో జరిగేది. రోడ్డుకు కొంచెం దగ్గరగావుండేది. అయినా రామచంద్రపురంనుండి వెళ్ళే నాకు దగ్గరేమిటి దూరం ఏమిటి. నేను వెళ్ళే సరికి కొంతమంది అప్పటికే వచ్చివున్నారు. ఒబ్బిని, ధర్మాచారి, నాగార్జున, కె.వి. రామానాయుడు, మొహనరెడ్డి, వారి మిత్రుడు, ప్రార్వతిమోహన్, లలితకుమారి శిలాలోలిత ఇలా.
పలకరింపులు అయ్యాక ఈ మద్య కాలంలో మనల్ని వదిలిపెట్టివెళ్ళిన సాహితీమిత్రుల్ని ఒక్కసారి గుర్తు చెసుకుంటూ మౌనం పాటించారు. ఒబ్బిని తన కవిత్వ పఠనాన్ని ప్రారంబించారు. ఇంతలో ఇంద్ర ప్రసాద్, మరికొద్దిసేపటికి అద్దేపల్లి రామ్మొహన రావు వచ్చారు. అద్దేపల్లి జ్వాలముఖితో వున్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు,
ఎప్పటిలాగే తన శ్రీకాకుళపు మాండలీకంతో విరుపుల, రాజశేఖరీయం అనే గల్పికను చదివి వినిపించారు.
శిలాలోలిత ఈమద్యకాలంలో దూరమౌతున్న సాహితీ మిత్రులను తలపోస్తూ ఏమైపోతున్నారు వీరంతా అంటూనే ......
ఈ మద్య తనకు ఆకాశవాణి జాతీయంగా ఎన్నుకున్న కవితను చదివి వినిపించారు.
వాళ్ళంతా దేహాన్ని విడిచారు
రాలిపడ్డ పూలల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమికరించుకుంటూ
దేహం అశశ్వతమని
అక్షరాల పూలే శాశ్వతమని చేదు గుళికలు మింగుతూ
రూప రహితులైన వారి జ్ఞాపకాలను
చమర్చుతున్న కన్నీళ్ళను అదిమిపడ్తూ ఆర్దత పొలమారుతుంటే
వాళ్ళ అక్షరాల వూత కర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం!
మరోకవితలోని కొన్ని పాదాలు
" బ్రతుకు కంటే స్వేచ్చ గొప్పది
స్వేచ్చంటే బాధను చుట్టుకున్న పొర చేదింపబటమే" అంటారు
మోహన రెడ్డిగారు తనకవితను వినిపించారు.
అద్దేపల్లిగారితో వచ్చిన ఆయన శిష్యుడు స్వియరచనా పాటలని పాడివినిపించారు.
నడిచే పుస్తంకగా మేము పిలుచుకొనే రామనాయుడు కొన్ని కవితలను, దిగంబర కవిత్వంలో తనకు బాగా గుర్తున్న వాక్యాలను వినిపించారు
అన్నా!
నీ గాయాలపైనుండి వీచిన గాలి ఎరుపెక్కింది
నువ్వు ఆసరాచేసుకున్న బొడ్డుమల్లె ఎరుపెక్కింది
నువ్వు పడ్డచోట భూమి కూడా ఎరుపెక్కింది
ఇంకో మాట విన్నావా
నువ్వు కొట్టిన బాణం దెబ్బకు గాలికూడా ఎరుపెక్కింది
ఇక నావంతు వచ్చేసరికి నాదగ్గార నేను రాసినవి ఏమిలేకపోవడంవల్ల, ఈ మద్యకాలంలో నాకు నచ్చిన "పొద్దు" లో వచ్చిన చదరంగం - ఒరెమునా(చావా కిరణ్) అనే కవితను చదివి వినిపించాను.
మరో ఉదయం అస్తమించింది,
రాతిరి చీకటిని తలుచుకుంటూ
కన్నీటి ప్రవాహం సాక్షిగా,
యద రోదన సాక్షిగా,
నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,
నిజ శరీర సాక్షిగా
…
మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలుచుకుంటూ.
తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,
విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,
అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,
ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,
…
మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలచుకుంటూ.
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
నవ్వుల జల్లుల సాక్షిగా,
యద కేరింతల సాక్షిగా,
ఆనంద, మాధుర్య, సగర్వ,
సమ్మోహ స్వ శరీర సాక్షిగా
…
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,
దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,
సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,
వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,
మరో ఉదయాగమనం.
రాతిరి పరిమళాలతో.
…
జీవితం ఎప్పుడూ ఇంతే,
ఒక కిటికీలో మోయలేని విషాదం
ఒక కిటికీలో భరించలేని ఆనందం."
ఇక లలితకుమారిగారు బాల సాయిబాబాపై రాసిన భక్తి పద్యాలను వినిపించారు, ముద్రితమైన పుస్తకాన్ని అందరికి పంచారు. చివరిగా అద్దేపల్లి ప్రెష్‌ష్ష్...........
కురగాయలు బహుళ కంపెనీలుగా మారిపోవడన్ని వినిపించారు.
తేనీరు సేవించి అందర్మూ ఒకరికొకరు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ శెలవు తీసుకున్నాము. బహుముఖాలుగా సాగిన ఈ సాహిత్య సాయంకాలం సుమహారంగా మారింది.
నిర్వహించిన సి.వి.కృష్ణారావుగారి మోములో కొత్త నందివర్దనం విరిసింది
........జాన్ హైడే కనుమూరి 3 కామెంట్లు
వార్తలో వ్యాసం ౨౮.౮.౨౦౧౧
లేబుళ్లు: నెలనెలా వెన్నెల, సమీక్షా, సాహిత్యం, సి.వి కృష్ణారావు
0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద మంగళవారం, ఆగస్టు 30, 2011
జ్వర సంధి ..............మునిపల్లె రాజు
లేబుళ్లు: కవితలు, నెలనెలా వెన్నెల, సాహిత్యం, సి.వి కృష్ణారావుఅది నా స్వగతాల స్వరం
జ్వరం నా జనని వడి
సడిచేయని వెచ్చని నది
అనాది స్వప్నాల నక్షత్ర యాత్రలను
దేహంవీడి దైన్యంగా పయనిస్తున్న ఆత్మకు
ఎన్నో పురో భయాల పాంద్రతర చిత్రాలను
రంగులు మారుతున్న ఉష్ణరక్త ప్రస్థానాన్ని
జ్వరసంధిలో తిలకిస్తుంటాను
ఎన్నడూ వినని భాషలో కవితలల్లుతుంటాను
చీలిన పొగమంచు తెరల రధ్యల్లో
జయ జయ మృదంగ నాద నేపధ్యంతో
ఏడుతరాల నా పూర్వికుల దర్శనం
ఆశువుగా ఆశాదుల ఆశః పరంపర
ఆకలి దప్పులు లేని ఆనంద మఠ విశ్రాంతి
జ్వరంలో నాకు సాధ్యం
యోగనిద్రకు అదే నా భాష్యం
......................................................నెలనెలా వెన్నెల-5 సంకలనం నుంచి
2 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద సోమవారం, ఆగస్టు 22, 2011
నెలనెలావెన్నెల సమావేశం
లేబుళ్లు: నెలనెలా వెన్నెల, సమావేశాలు, సి.వి కృష్ణారావుశ్రీ రూప్‌కుమార్
శ్రీ ధర్మాచారి
శ్రీ కుమార్
శ్రీ బ్రహ్మానందం
శ్రీ కె.వి రామానాయుడు
శ్రీమతి పార్వతీమోహన్ హాజరయ్యారు
శ్రీ సి.వి.కృష్ణారావు గారు అందరిని పరిచయం చేసారు
నాగేశ్వర రావు గారు విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్యుడు.
కొన్ని అనుభవాలను, కొన్ని పద్యాలను పంచుకున్నారు.
ఆందరూ తమ తమ కవితల్ని పఠనం చేసారు.
.......................శ్రీమతి పార్వతీమోహన్
శేషభట్టర్ రఘు కవిత నెల నెలా వెన్నెల సంకనం-5
లేబుళ్లు: కవితలు, కవిత్వం, నెలనెలా వెన్నెల, సి.వి కృష్ణారావుశేషభట్టర్ రఘు

ఆమె
మందారానికి బంగారం అద్దినట్టు నవ్వుతుంది
అప్పుడు
వెన్నెలకు చిల్లుపడి గదిలోకి రాల్చినట్టుంటుంది
తన మెత్తని పెదాల ఉన్నిచర్మం మంత్రదండంలా
జఢత్వాన్ని చిత్తుచేస్తుంది
ఇక నీటి పక్షుల్లా తిరిగే నా ప్రేమాన్విత మోహాన్ని
ద్రాక్షారస సాయంత్రాన్ని
మనోహర పుష్పంలాంటి తన ఉనికివైపు నడుపుతాను
ఒక ధూమ ప్రతిమనై
తను శ్వాసించే దారుల్ని తాకుతాను
ఏమాటామకామాట విడివిడిగా పేర్చిన
పొడిప్రేమల పలకల్ని విసిరేసి వస్తాను
ఇక కలల కొనలమీద
పిల్లనగ్రోవిలాంటి వాక్యం నేను
నెల నెలా వెన్నెల On Kinige
3193 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శుక్రవారం, జులై 08, 2011
వాడ్రేవు చినవీరభద్రుడు కవిత నెలనెలా వెన్నెల అయిదవ సంకలనం నుంచి
లేబుళ్లు: కవితలు, నెలనెలా వెన్నెల, సాహిత్యం, సి.వి కృష్ణారావు......వాడ్రేవు చినవీరభద్రుడు
మళ్ళీ అదేదారి, అదే అడవి
ఒణికిస్తున్న శీతపవనాలు
భువి పైన వేల శుభాకాంక్షలు
క్రిస్మస్ తారలు
విజ్జీ, దగ్గరగా జరుగు, సర్దుకు కూచో
ఈ ఎర్రబస్సులో ఈ గుడిహత్నూర్,
ఈ ధనోర, ఈ ఇంద్రవెల్లి
కట్టుకోవడానికి గుడ్దకు కూడా నోచని
ఆ తల్లులు, ఆ పిల్లలు
విజ్జీ, పయనించాలి మనం
కనీసం ఆరునెలలకొకసారైనా
ఈ అడవిబాటని, వెతుక్కుంటూ
మనని మనం గుర్తుపట్టడానికి
విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత
చెక్‌డాంలు, పత్తిచేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ, దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి
విజ్జీ, ఇది మనవూరు, మన అడవి.
............3127 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, జులై 06, 2011
అందరకీ ఆహ్వానము - జూన్ నెల సమావేశము
లేబుళ్లు: నెలనెలా వెన్నెల, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుజూన్ నెల సమావేశము
కొన్ని సాహిత్య కబుర్లు
శ్రీ బి. యస్. యం. కుమార్
కవితా తొలిపఠనం
స్వీయ కవితా పఠన
తేదీ. 26.06.2011 ఆదివారము
సాయంకాలం 5.30 గంటల నుండి
స్థలము
శ్రీ సి. వి. కృష్ణా రావు
103, బాబూ టవర్శ్, చైతన్యపురి, హైదరాబాదు.
అయితేనేం??
లేబుళ్లు: కవితలు, కవిత్వం, నెలనెలా వెన్నెల, సాహిత్యం, సి.వి కృష్ణారావు
ముకుంద రామారారావు
9908347273
అవయవాల సహాయ నిరాకరణ
అతనికిపుడు వినబడదు
బోలెడన్ని తెలుసుకోవాలని
అణుచుకోలేని ఆరాటం ఎపుడూ
ఎవరెవరో దగ్గరగా వచ్చి
ఏవేవో చెబుతారు
కాస్త నవ్వుతూ
తలూపుతూ
గాలిలో చేయూపుతూ
శ్రద్దగా వింటున్నట్టున్నా
వినబడి వినబడక
తెల్లమొహం వేస్తున్నట్టు
కనపడనీయని చిరునవ్వు
సమాధాల్ని బట్టి
వినబడ్డదో లేదోనన్న అంచనా
అందరిదీ
నిశ్శబ్దంలోనే అతను
అన్నీ మాటాడుతూనే ఉన్నాడని
కాస్సేపూ
పోగొట్టుకున్నదేదో పొందుతూనే ఉన్నాడని
ఎవరికెంత తెలుసు
(ఎందరో కవులకు నెలనెలా వెన్నెలైన సి.వి. కృష్ణారావు గారికి నమస్సు మనస్సుతో)
నెలనెలావెన్నెల 5 సంకలనము నుంచి http://kinige.com/kbook.php?id=141 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శనివారం, మే 21, 2011
అందరకీ ఆహ్వానము
లేబుళ్లు: నెలనెలా వెన్నెల, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుమే నెల సమావేశము
కొన్ని సాహిత్య కబుర్లు
స్వీయ కవితా పఠన
తేదీ. 29.05.2011 ఆదివారము
సాయంకాలం 5.30 గంటల నుండి
స్థలము
శ్రీ సి. వి. కృష్ణా రావు
103, బాబూ టవర్శ్, చైతన్యపురి, హైదరాబాదు.
దూరవాణి 040-24044262
నెలనెలా వెన్నెల -5 సంకలనము
అంతర్జాలములో ఇక్కడ పొందవచ్చు.
http://kinige.com/kbook.php?id=141
------------------------
2917
వైవిధ్య కవితల సమాహారం
లేబుళ్లు: కవిత్వం, నెలనెలా వెన్నెల, సమీక్షా, సాహిత్యం, సి.వి కృష్ణారావు

... హరిత
దాదాపు ముప్పయ్యేళ్ళు కిందట "నెలనెలా వెన్నెల" ఆరంభమైంది. కవుల్ని ప్రోత్సహించిన సంస్థ ఇది. ప్రత్యేకించి ఒక నిర్మాణం అంటూ లేకున్నా కవిత్వానికి ఊతమిచ్చిన ఈ సంస్థ ఇదివరలో నాలుగు సంకలనాలు ప్రచురించింది. ఇప్పుడు అయిదో సంకలనం "నెలనెలావెన్నెల" (కవన సంకలనం) శీర్షికన వచ్చింది. వైవిధ్యమైన కవిత్వం ఇందులో కనిపిస్తోంది. భిన్న దృక్పథాలు, భావజాలాలకి చెందినవారి అభివ్యక్తిని ఒకచోట చేర్చడం బావుంది. అందెశ్రీ పాటతో ఆరంభమైన ఈ పుస్తకంలో తెలంగాణా భాషకీ, పలుకుబడికీ తగిన ప్రాతినిధ్యం లభించింది. ప్రముఖులు, వర్ధమాన కవులు, కొత్త కవులు రాసిన కవిత్వంలోని పోకడలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్తమాన సమాజంలోని కల్లోలాలకి కవులు ఏవిధంగా స్పందిస్తున్నారో ఈ పుస్తకం చెబుతుంది. గ్లోబలైజేషన్ తాకిదిపై స్పందన, తెలంగాణా ఉద్యమ ప్రతిద్వనులు, వైయక్తికమైన సంవేదనల సమాహారం ఈ కవితా సంకలనం. ఈ పుస్తకానికి మునిపల్లె రాజు, కె.వి. రామానైడు, సి.వి.కృష్ణారావు, పార్వతిమోహన్, జాన్ హైడ్ కనుమూరి సంపాదకులుగా వ్యవహరించారు. మంచి కవిత్వం చదవాలని తపించేవారికి ఇ పుస్తకం ఓ వరప్రదాయని. నెలనెలావెన్నెల కార్యక్రమాల తీరుతెన్నుల్ని ముందు పేజీల్లో వివరించడం బావుంది. ఈ సంస్థ కృషి, కంట్రిబ్యూషన్ మీద పరిశోధన చేయాలనుకునేవారికి ఉపయుక్తమైన సమాచారమిది.
(వార్త ఆదివారం అనుబంధం 17 ఏప్రిల్ 2011 సౌజన్యంతో) 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద గురువారం, మే 05, 2011
మార్చి నెల సమావేశము
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుమార్చి నెల సమావేశము
27.3.2011, సాయత్రము 5.30 గంటలనుండి.
phone 040 24044262 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శుక్రవారం, మార్చి 25, 2011
వైతరణి
లేబుళ్లు: కవితలు, కవిత్వం, సాహిత్యం, సి.వి కృష్ణారావుఒక్కొక్క నగరం దేహం మీద
మానని రాచపుండులా
వేదన హృదయంలో ఒత్తిగిలక
వెలికి వచ్చిన ఒక చిహ్నంలా
మూలకొక్క మురికిపేట
వేలకొలది జనుల విషాద గాధ
బురదలో పురుగులు మసలినట్లు
ఎన్నడూ మోములెత్తి మిన్నువైపు చూడక
వేడికి ఎండి చలికి స్రుక్కి
గాలికి వాలి తుఫానులో తృళ్లిపడి
ఈబంధన సత్యమని
ఈ బ్రతుకు అనిత్యమని
బాధల మహాభారతంలో
మురికిపేటలో మసలే మూగజీవాలు
గుడిసెల చూరు భూమికి జాగిలపడి
తమ సంపాదన
వేదనతో రోదించే శిశువుల
పెదిమలు తడపజాలని సలిల బిందువులై
రోగాలు వేగంగా మోసుకొచ్చే
క్రిమి కీటకాలు సహగాములై
తమ స్వప్నావస్థలో
కంకాళాలు నింపుకొస్తుంటే
జీవన వ్యాపారం అక్కడా జరుగుతూనే వుంది
స్మశానాలకు చోటు విడమర్చి
భయపడి పక్కకు తొలిగిన హర్మ్యాలు
తమ నగరంలో
సజీవ మానవాస్థిపంజరాలు మసులుతుంటే
ఇంకా ఎటూ కదలటంలేదు
మానవుడు చూడని లోకంలో
ఈ భువినే నిర్మించాలని
చేసే ప్రోద్బలన
ఆకసమంటే హర్మ్యాలు
యమలోకం త్రోవలో వైతరణి
మురికి పేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ
వైతరణి ఒడ్డున
బాధకు చిహ్నాలై
సుప్రసిద్ధ గాధలకు నాయకులై
ఒకడు గుహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు
ఒకడు బంధువు
నివాసం = కుటీరంలో - తుఫానులో
ఆశ = ఆరుతూ - వెలుగుతూ
విశ్వాసం = వికసిస్తూ - హ్రస్వమౌతూ
ఓర్పు = ఘనీభవిస్తూ - ఆవిరౌతూ
బ్రతుకు = దు:ఖంలో - నిర్వీర్యతలో.
(వైతరణి - కావ్యం 1968 ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ నుండి)
2744 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శుక్రవారం, మార్చి 18, 2011
ఒకానొక సందర్భం
లేబుళ్లు: కవిత్వం, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు
ఒకానొక సందర్భంశ్రీ మునిపల్లి రాజు గారు , శ్రీ సి.వి. కృష్ణారావు గారిని కొత్త బట్టలతో సత్కరించారు 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శనివారం, మార్చి 12, 2011
నెలనెలా వెన్నెల సంకలనం - 5 ఆవిష్కరణ సభ
లేబుళ్లు: కవిత్వం, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు2606
0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద సోమవారం, ఫిబ్రవరి 07, 2011
సంధ్య - (కవిత)
లేబుళ్లు: కవితలు, కవిత్వం, సాహిత్యం, సి.వి కృష్ణారావుమస్తిష్కం
రంగుల్ని అందాల్ని వెంటాడుతుంటాయి
కళ్ళు
చప్పరిస్తుంది మధువు గరళము
జిహ్వ
కాలి వేడిములకు పరవసిస్తుంది
త్వక్కు
నిండాలని పండాలని
ఉదరం
పర్వతాలలో పాతాళంలో
పాదాలు
ఇందర్నీ మరిపించే క్షణం
అది మహత్తరం
సంధ్య
2458
0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, జనవరి 05, 2011డిశెంబరు నెల సమావేశము - అందరికీ ఆహ్వానమే
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు
12వ తేదీ ఆదివారము సాయంత్రము 5.30 గంటల నుండి
అందరికీ ఆహ్వానమే
స్థలము :
సి.వి.కృష్ణా రావు
103, బాబూ టవర్స్,
చైతన్యపురి, హైదరాబాదు
దూరవాణి 040 24044262
2374 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద గురువారం, డిసెంబర్ 23, 2010
నెల నెలా వెన్నెల సమావేశము ౨౮.౧౧.౨౦౧౦
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు
౨౮.౧౧.౨౦౧౦ ఆదివారము
హృదయాంజలి - జాన్ హైడ్ - పుస్తకావిస్కరణ
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుస్థలము : ఆస్మాంఘడ్, మలకపేట, హైదరాబాదులో పుస్తకావిష్కరణ జరిగింది
ఆవిష్కర్త - శ్రీ మునిపల్లె రాజు
సాహిత్యంలోకి యాత్రికుడిగా వస్తున్న జాన్ హైడ్‌కు ఆహ్వానం పలుకుతూ అభినందించారు.
వక్తలు - శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ ఎం. వీరయ్య, శ్రీ శీలా వీర్రాజు, శ్రీ నాళేశ్వరం శంకరం ప్రసంగించారు.
నెలనెలా వెన్నెల మిత్రులు ఎక్కువమంది పాల్గన్నారు.
శ్రీ సి.వి. కృష్ణా రావు గారు వుంటున్న ఇంటిపైభాగము అప్పటికి ఖాళీ వుండటంతో అక్కడ నిర్వహించారు.



సెప్టెంబరు సమావేశము
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు






ఈ నెల సమాఫేశములో సంకలనపు పనుల పురోగతిని గురించి చర్చించడమైనది. ఇప్పాటికి అందిన 38 కవితలను డి.టి.పి రూపంలో చిత్తుప్రతిని జాన్ హైడ్ తయారు చేశారు. వీలునుబట్టి పుస్తకం అక్టోబరు మాసపు నెలనెలావెన్నెలలో ఆవిష్కరించాలని ఒక ఆలోచన అందరి దగ్గరనుండి వెలువడింది. ఏదైనా హాలులో నిర్వహిస్తే ఎలావుంటుంది, చాలామంది రావడానికి అనుకూలంగా వుంటుందని అభిప్రాయం. సాద్యా అసాద్యాయాలు మిత్రులు బేరీజు వేయాలి
ఇంకా తమ కవితలు ఇవ్వనివారు 10వ తేదీలోగా ఇస్తే బాగుంటుందని నెలనెలావెన్నెల సమయానికి పుస్తకాన్ని ముస్తాబుచెయ్యడానికి బాదుంటుందనే అభిప్రాయానికి వచారు.
బి.ఎస్.ఎం. కుమార్
ఎం.ఎస్. నాయుడు
జాన్ హైడ్ కనుమూరి
పార్వతీ మోహన్ తమ కవితలను చదివారు
నిశాపతి,
మురళీధర్ గౌడ్
నిత్యానందరావు,
సి.వి.కృష్ణరావు
శ్రీమతి సీతాదేవి గార్లు పాల్గొన్నారు
సి.వి. కృష్ణారావుగారి మనుమడు తర్వాతి నెల నేను కవిత్వాన్ని రాసి చదువుతాను అనడం కొసమెరుపు.
అమ్మ వచ్చింది నీ మాటలేదు
లేబుళ్లు: కవితలు, కవిత్వం, సాహిత్యం, సి.వి కృష్ణారావుఅమ్మ వచ్చింది నీ మాట లేదు
పాలగ్లాసు నింపి తాగిపో
ఇప్పుడేవస్తా
ఎప్పుడొస్తావు
ఆశల హారాలు నీకు తొడిగి
ఇంత బతుకు బతికాము
నిరాశల హారాలు మాకుతొడిగి
నీవు శాశ్వత శాంతిపొందావు
నిండిన ప్రేమఘటమనుకొన్న
ఈ బొందినుంచి పేగు మాడిపోయింది
అన్ని విలువలు ఆవిరైపొయినయి
పండంటి శిశువును హత్తుకున్న
తల్లి కౌగిలిలో మిగిలిందినీడ
ఇటు బాషాం అటు ఆక్సఫర్డు
నీతో మాట్లాడాల్ని ఎదురు చూస్తున్న స్నేహితులు
దారిన ముల్లు ఎవరిని గాయపరుస్తుందోనని
నీ శకటం దిగి
దారినున్న కంటకాన్ని తొలగించి
ముందుకుసాగిన అల్ప మిత్రుత్వం
గాయపడని పధికుడి చల్లని చూపులు
నీ వెంటున్నా ఆశీస్సులు
నడుస్తున్న బాటలో ప్రతివ్యక్తి
ముఖంలోకి చూస్తూ
రమేశ్ అని పిలిచేటప్పటికి
నా వేపుచూసి
ఎందుకు ఏడుస్తున్నావన్నాడు
------ సి.వి. కృష్ణారావు 4 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శుక్రవారం, సెప్టెంబర్ 10, 2010
సంపత్కుమార సంస్కృతి
లేబుళ్లు: వ్యాసాలు, సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావు
అదుగో మనకళ్ళముండే మెదుల్తున్నాడు. చలువచేసిన తెల్లని లాల్చీ, ధోవతీ విశ్వవిద్యాలయం ఆచార్య పదవి అదిష్టించిన విద్యావేత్త ఠీవితోలేడు. ఇప్పుడు కేకేస్తే వినపడనంతటి దూరానికి పయనిస్తున్నాడు.
నెలనెలా వెన్నెల సభ్యులను ప్రేమించి, వారితో సాంగత్యాన్ని పెంచుకొన్న ఒక పండితుడూ, కవీ, విమర్శకుడైన కోవెల సంపత్కుమారాచార్య 11 ఆగష్టు 2010న మమ్మల్ని విడిచిపోయారన్న బాధ ఇప్పట్లో తరిగేది కాదు.
ఆయన వరంగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసరుగా వున్నంతకాలం (1993 జూన్ నెలాఖరున) పదవీ విరమణ చేసిన తరువాత సాహితీ వ్యాసాంగంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడు.
ఎక్కడ సాహిత్యగోష్టిలో కూర్చున్నా, విషయాన్ని లోతుగా తరచి చూసే సంపత్కుమార అభిప్రాయం కోసం శ్రోతలు ఉత్సుకతో ఉండేవారు. ఆయన విశ్లేషణ అత్యంత విలువైనదిగా వుండేది.
సంపత్కుమార రచనలు చాలా వున్నవి. గాధా సప్తాశతి లో కొన్నిటిని మధుర గాధలుగా వెలువరించాడు. యతీంద్రావ్యాజ రామానుజా అనే మకుటంతో ఒక ప్రౌఢ శతకం రచించాడు. ప్రణ కవితా రధ్య అలే శీర్షికతో కృష్ణ శాస్త్రి, నాయల్ర్, వేదుల, రాయప్రోలు, విశ్వనాధుల కవిత్వంపై స్రవంతి పత్రికలో (1957-58) వ్యాసాలు రాశాడు.
సాంప్రదాయిక కావ్య శాత్ర పాండిత్యంతో పాటు ఆధునిక సాహిత్యంలో లోతైన ప్రవేశమున్న సాహిత్యవేత్త.
ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన చందస్సుపై చేసిన కృషి ఇంకో ఎత్తు. చేకూరు రమారావు గారంటారు : ఆంధ్ర చందస్సంప్రదాయంపై సాధికారంగా మాట్లడగలిగిన ఒకే ఒక పెద్ద దిక్కు ఆయన.
సంపత్కుమారకూ, చే.రా.కు రా.కు వచన కవిత్వంపై చాలా కాలం చంధో వివాదం జరిగింది. అది సాహిత్యాభిమానులు చాలా ఆతురతతో గమనించేచారు. అయితే ఇంత వాడిగా జరిగినా వ్యక్తి దూషణలు లేకుండా విషయప్రధానంగా జరిగిన చర్చ అప్పటికీ ఇప్పటికీ ఆదర్శమైన సాహిత్య చర్చగా నిలిచిపోయింది.
వచన పద్యం లక్షణ చర్చ అన్న పేరుతో వీరిరువురి రచన నాయని సుబ్బారావు గారికంకితమిచ్చారు. తరువాత రాజమండ్రిలో జరిగిన సాహిత్య గోష్టిలో తెలుగు చందస్సు పై కొత్తవెలుగు అన్న వ్యాసం ప్రచురించారు.
కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య ఇతర మిత్రులు కలిసి చేతనావర్తనం సంపుటాలు ప్రచురించారు. ఒక సంపుటి సిద్ధాంత ప్రవచనం మాత్రమే కాకుండా ఒక కవిత కూడా వ్రాశారు.
ఏ మార్గంమీదనైనా, పూర్వ ఆధునిక కావ్యాల రెండింటినీ సమాన గౌరవంతో పరిశీలించి కొత్తవెలుగుల్ని అందించారు. ఇంత త్వరలో మనల్ని విడిచి పోవటంవల్ల ఎన్నో నూతన భావావిష్కరణకు మనం కొరత పడ్డవారమైనాము.
సి.వి. కృష్ణారావు
నెలనెలావెన్నెల 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, సెప్టెంబర్ 01, 2010
నెల నెలనెలా వెన్నెల ౩౦౨వ సమావేశము
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యంశ్రీ ధర్మాచారి
శ్రీ రఘు
శ్రీ కే. వి. రామా నాయుడు
శ్రీమతి పార్వతి మోహన్ సమావేశములో పాల్గొన్నారు.
తమ తమ స్వీయ కవితలు చదివారు
౫వ సంకలనము తేవాలనే ఆలోచన కార్యరుపానికై ఎమిసెయ్యాలనే విషయాన్ని చర్చించారు
త్వరలో సంకలనాన్ని తేవడానికి పనిచెయ్యాలని అందుకు రాని మిత్రులతో మాట్లాడాలని నిర్ణయించారు.
నెలనెలా వెన్నెల మిత్రులు ఈ బ్లాగు చుస్తున్నాట్లయితే స్పందించగలరు
............౧౭౦౪.1704...... 1 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద సోమవారం, జులై 26, 2010
ఈ సమావేశం 301వది.
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుపదం పాటైనప్పుడు అది పిల్లకాలువై, సెలయేరై, నదిగా మారి లోతుగా ప్రవహిస్తూ, తీరాలను ఆదరిని ఈ దరిని కలుపుతూ సాగిపోతుంటుంది. అలాంటి నదీప్రవాహంగా సాగిన సాయంకాలం, 27.6.2010.
నదిని తలపోస్తూ వచ్చిన వారిని పాటల నదిలో మునకలేయించారు శ్రీ అందెశ్రీ తనపాటలతో. మనిషి మనిషిగా కనుమరుగైపోతున్న తనాన్ని గుర్తుచేసారు.
శ్రీ ధర్మాచార్యులు
శ్రీ నాగార్జున
శ్రీ రఘు
శ్రీ నిషాపతి
శ్రీ రఘు
శ్రీ కె.వి. రామనాయుడు
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి పార్వతిమోహన్ హాజరైనారు 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద మంగళవారం, జులై 06, 2010
జారిన శిథిలాలు
లేబుళ్లు: కవితలు, కవిత్వం, సాహిత్యం, సి.వి కృష్ణారావుముసల్ది మంచాన
యాద మర్చిన క్షణాన
విపత్తు
ఎదురైన చీకట్లోకి
ఆర్తనాదాలుతప్ప అండలేక
అందుకునే చేతుల్లేక
వేలాది జనం
వందలాది గ్రామాలు
మాయమైన దారులమీద
పరుగులు
చెట్టుకూలింది
గూడు చెదిరింది
పిట్టలు పుల్లకోసం
తిరుగుతున్నయి
అనాదికాలపు జనకథ మొదలు
బతుకు మళ్ళా మొదటికి
కృష్ణా తుంగభద్రలు పొంగినయి
సూర్యుడు పడమట వుదయించాడు
వెటకారం
నిశ్శబ్దం
వెలుగులేనిదారి
గొంతులేనిఘోష
చిదిమిన ప్రాణం
నేల చచ్చిపోయింది
రేపులేదు 0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద శనివారం, జూన్ 26, 2010
వర్ణాల దూరాన నా చెల్లి
లేబుళ్లు: కవితలు, కవిత్వం, సి.వి కృష్ణారావు
కవిత్వం గుండెలో గులాబీ పరిమళిస్తుంది
బాధను మరిపించి మనస్సును ఆదరిస్తుంది
ఒక వీరుని విజయకేతనమవుతుంది
కవిత్వమొక్కటే కల్మషాన్ని కడిగేస్తుంది
అయిదు అడుగుల దూరం
అయిదు ఆమడల దూరం
అయిదు వర్ణాల దూరం
ఉంటేనేం
మతిచెరగని మనసు వదలని
నా కవల చెల్లీ
నిన్ను కౌగలించుకుంటాను
అణువణువూపొంగి
ఆత్మీయుణ్ణవుతాను
కవిత నా కన్నీటి చుక్క
ఆనంద భాష్పం
అందులో అందాల బొమ్మవు నీవే
.. వార్త 29.3.2004
నెలనెలా వెన్నెల ఈ నెల సమావేశము
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుశ్రీ జాన్ హైడ్ కనుమూరి, శ్రీ ధర్మాచారి, శ్రీ కె.వి. రమానాయుడు, శ్రీమతి పార్వతీమోహన్ పాల్గొన్నారు.
సంకలనంకోసం వచ్చిన కవితలు, రాని వాటిని ఎలా సేకరించాలి అనే విషయం చర్చకు వచ్చింది.
నెలనెలా వెన్నెల మిత్రులు ఈ బ్లాగుచూస్తున్నట్లయితే స్పందించి మీ కవితలను పంపగలరు. 2 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద సోమవారం, మే 31, 2010
నెలనెలా వెన్నెల సమవేశము 25.౪.౨౦౧౦ ఫోటోలు
లేబుళ్లు: సమావేశాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుయాకూబ్ గారు ఇది శ్రీశ్రీ స్మారక సభ అన్నారు.ఆయన శ్రీశ్రీ రాసిన పతితులార భ్రస్టులార పాట పాడారు.
జగన్ పాడవోయి భారతీయుడా అని పాడారు.
శిలాలొలిత ,రేణుక అయోల,,వీరయ్య, ధర్మా చారి,పార్వతిమూహన్ , యం.స్.నాయుడు,
క్రిష్ణారావు గార్లు కవితా గానం చేసారు. శ్యామల, ప్రసాద్ గారు, శ్రీనివాస రావు, రాములు పాల్గొన్నారు.









పార్వతి మొహన్ 4 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద మంగళవారం, ఏప్రిల్ 27, 2010


2139




