RSS

సంపత్కుమార సంస్కృతి


అదుగో మనకళ్ళముండే మెదుల్తున్నాడు. చలువచేసిన తెల్లని లాల్చీ, ధోవతీ విశ్వవిద్యాలయం ఆచార్య పదవి అదిష్టించిన విద్యావేత్త ఠీవితోలేడు. ఇప్పుడు కేకేస్తే వినపడనంతటి దూరానికి పయనిస్తున్నాడు.
నెలనెలా వెన్నెల సభ్యులను ప్రేమించి, వారితో సాంగత్యాన్ని పెంచుకొన్న ఒక పండితుడూ, కవీ, విమర్శకుడైన కోవెల సంపత్కుమారాచార్య 11 ఆగష్టు 2010న మమ్మల్ని విడిచిపోయారన్న బాధ ఇప్పట్లో తరిగేది కాదు.
ఆయన వరంగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసరుగా వున్నంతకాలం (1993 జూన్ నెలాఖరున) పదవీ విరమణ చేసిన తరువాత సాహితీ వ్యాసాంగంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడు.
ఎక్కడ సాహిత్యగోష్టిలో కూర్చున్నా, విషయాన్ని లోతుగా తరచి చూసే సంపత్కుమార అభిప్రాయం కోసం శ్రోతలు ఉత్సుకతో ఉండేవారు. ఆయన విశ్లేషణ అత్యంత విలువైనదిగా వుండేది.
సంపత్కుమార రచనలు చాలా వున్నవి. గాధా సప్తాశతి లో కొన్నిటిని మధుర గాధలుగా వెలువరించాడు. యతీంద్రావ్యాజ రామానుజా అనే మకుటంతో ఒక ప్రౌఢ శతకం రచించాడు. ప్రణ కవితా రధ్య అలే శీర్షికతో కృష్ణ శాస్త్రి, నాయల్ర్, వేదుల, రాయప్రోలు, విశ్వనాధుల కవిత్వంపై స్రవంతి పత్రికలో (1957-58) వ్యాసాలు రాశాడు.
సాంప్రదాయిక కావ్య శాత్ర పాండిత్యంతో పాటు ఆధునిక సాహిత్యంలో లోతైన ప్రవేశమున్న సాహిత్యవేత్త.
ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన చందస్సుపై చేసిన కృషి ఇంకో ఎత్తు. చేకూరు రమారావు గారంటారు : ఆంధ్ర చందస్సంప్రదాయంపై సాధికారంగా మాట్లడగలిగిన ఒకే ఒక పెద్ద దిక్కు ఆయన.
సంపత్కుమారకూ, చే.రా.కు రా.కు వచన కవిత్వంపై చాలా కాలం చంధో వివాదం జరిగింది. అది సాహిత్యాభిమానులు చాలా ఆతురతతో గమనించేచారు. అయితే ఇంత వాడిగా జరిగినా వ్యక్తి దూషణలు లేకుండా విషయప్రధానంగా జరిగిన చర్చ అప్పటికీ ఇప్పటికీ ఆదర్శమైన సాహిత్య చర్చగా నిలిచిపోయింది.
వచన పద్యం లక్షణ చర్చ అన్న పేరుతో వీరిరువురి రచన నాయని సుబ్బారావు గారికంకితమిచ్చారు. తరువాత రాజమండ్రిలో జరిగిన సాహిత్య గోష్టిలో తెలుగు చందస్సు పై కొత్తవెలుగు అన్న వ్యాసం ప్రచురించారు.
కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య ఇతర మిత్రులు కలిసి చేతనావర్తనం సంపుటాలు ప్రచురించారు. ఒక సంపుటి సిద్ధాంత ప్రవచనం మాత్రమే కాకుండా ఒక కవిత కూడా వ్రాశారు.
ఏ మార్గంమీదనైనా, పూర్వ ఆధునిక కావ్యాల రెండింటినీ సమాన గౌరవంతో పరిశీలించి కొత్తవెలుగుల్ని అందించారు. ఇంత త్వరలో మనల్ని విడిచి పోవటంవల్ల ఎన్నో నూతన భావావిష్కరణకు మనం కొరత పడ్డవారమైనాము.


సి.వి. కృష్ణారావు
నెలనెలావెన్నెల 0 కామెంట్‌లు