RSS

డేట్‍ లైన్: హైదరాబాద్, 2010 హెచ్ ఆర్. కే















రేగుపండ్లు ఎక్కడైనా ఉంటాయి,

టుంకిపండ్లు కూడా.

జొన్న రొట్టెలు, వెన్నముద్దలు,

ఒళ్లో పాపాయిలతో అమ్మలు

ఎక్కడైనా ఉంటారు.

అమ్మ, నాన్న, ఏరు, ఊరు మాటలు వున్న చోట్ల

అమ్మ, నాన్న, ఏరు, ఊరు ఉంటాయనుకుంటాం.

ఎవరెవరో అమ్మలతో, నాన్నలతో, ఏళ్లతో, వూళ్లతో

ఉండిపోతాం.

చెమటలో చెమట నెత్తుటిలో నెత్తురు అయిపోతాం.

నిజమే,

ఇసుకలలో మా మద్దిలేటి వాగు ఇసుక వేరు.

నిన్న మా ఊరికి వెళ్లొచ్చాను.

అక్కడ నేనెరిగిన వాళ్లెవరూ లేరు.

ఇసుక అసలే లేదు.

కాలం కూడా స్థలం వంటిదేనని తెలిసి వచ్చింది.

ఒక్కుమ్మడిగా వరదలెత్తిన స్థలాల్ని వదిలి

కాలం చెట్టు మీద గూళ్లు కట్టుకున్న వాళ్లం,

ఒకే సమయం కొమ్మల మీద బతుకుతున్న వాళ్లం

కాలాన్ని కొలతలు వేసి పంచుకోగలమా?




...........................నెలనెలా వెన్నెల సంకలనం ౫లోని హెచ్.ఆర్.కే. కవిత

0 కామెంట్‌లు