RSS

వైవిధ్య కవితల సమాహారం




... హరిత

దాదాపు ముప్పయ్యేళ్ళు కిందట "నెలనెలా వెన్నెల" ఆరంభమైంది. కవుల్ని ప్రోత్సహించిన సంస్థ ఇది. ప్రత్యేకించి ఒక నిర్మాణం అంటూ లేకున్నా కవిత్వానికి ఊతమిచ్చిన ఈ సంస్థ ఇదివరలో నాలుగు సంకలనాలు ప్రచురించింది. ఇప్పుడు అయిదో సంకలనం "నెలనెలావెన్నెల" (కవన సంకలనం) శీర్షికన వచ్చింది. వైవిధ్యమైన కవిత్వం ఇందులో కనిపిస్తోంది. భిన్న దృక్పథాలు, భావజాలాలకి చెందినవారి అభివ్యక్తిని ఒకచోట చేర్చడం బావుంది. అందెశ్రీ పాటతో ఆరంభమైన ఈ పుస్తకంలో తెలంగాణా భాషకీ, పలుకుబడికీ తగిన ప్రాతినిధ్యం లభించింది. ప్రముఖులు, వర్ధమాన కవులు, కొత్త కవులు రాసిన కవిత్వంలోని పోకడలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్తమాన సమాజంలోని కల్లోలాలకి కవులు ఏవిధంగా స్పందిస్తున్నారో ఈ పుస్తకం చెబుతుంది. గ్లోబలైజేషన్ తాకిదిపై స్పందన, తెలంగాణా ఉద్యమ ప్రతిద్వనులు, వైయక్తికమైన సంవేదనల సమాహారం ఈ కవితా సంకలనం. ఈ పుస్తకానికి మునిపల్లె రాజు, కె.వి. రామానైడు, సి.వి.కృష్ణారావు, పార్వతిమోహన్, జాన్ హైడ్ కనుమూరి సంపాదకులుగా వ్యవహరించారు. మంచి కవిత్వం చదవాలని తపించేవారికి ఇ పుస్తకం ఓ వరప్రదాయని. నెలనెలావెన్నెల కార్యక్రమాల తీరుతెన్నుల్ని ముందు పేజీల్లో వివరించడం బావుంది. ఈ సంస్థ కృషి, కంట్రిబ్యూషన్ మీద పరిశోధన చేయాలనుకునేవారికి ఉపయుక్తమైన సమాచారమిది.
(వార్త ఆదివారం అనుబంధం 17 ఏప్రిల్ 2011 సౌజన్యంతో) 1 కామెంట్‌లు