RSS

డేట్‍ లైన్: హైదరాబాద్, 2010 హెచ్ ఆర్. కే















రేగుపండ్లు ఎక్కడైనా ఉంటాయి,

టుంకిపండ్లు కూడా.

జొన్న రొట్టెలు, వెన్నముద్దలు,

ఒళ్లో పాపాయిలతో అమ్మలు

ఎక్కడైనా ఉంటారు.

అమ్మ, నాన్న, ఏరు, ఊరు మాటలు వున్న చోట్ల

అమ్మ, నాన్న, ఏరు, ఊరు ఉంటాయనుకుంటాం.

ఎవరెవరో అమ్మలతో, నాన్నలతో, ఏళ్లతో, వూళ్లతో

ఉండిపోతాం.

చెమటలో చెమట నెత్తుటిలో నెత్తురు అయిపోతాం.

నిజమే,

ఇసుకలలో మా మద్దిలేటి వాగు ఇసుక వేరు.

నిన్న మా ఊరికి వెళ్లొచ్చాను.

అక్కడ నేనెరిగిన వాళ్లెవరూ లేరు.

ఇసుక అసలే లేదు.

కాలం కూడా స్థలం వంటిదేనని తెలిసి వచ్చింది.

ఒక్కుమ్మడిగా వరదలెత్తిన స్థలాల్ని వదిలి

కాలం చెట్టు మీద గూళ్లు కట్టుకున్న వాళ్లం,

ఒకే సమయం కొమ్మల మీద బతుకుతున్న వాళ్లం

కాలాన్ని కొలతలు వేసి పంచుకోగలమా?




...........................నెలనెలా వెన్నెల సంకలనం ౫లోని హెచ్.ఆర్.కే. కవిత

0 కామెంట్‌లు

నేలనేలావేన్నెలనెలనెలావెన్నెల - నవంబరు2011 సమావేశము

27.11.2011 ఆదివారము సాయంత్రం
-------------------------------------------

పది సంవత్సరాలలో కవిత్వము అనే అంశముపై శ్రీ ద్వానా శాస్త్రి మాట్లాడారు.
ఈ కాలంలో జరిగిన మార్పులు, ఉద్యమాలు , కవిత్వ పరిస్థితులను విశ్లేషించారు

శ్రీ సి.వి. కృష్ణారావు
శ్రీ సుబ్బారవు
శ్రీ ధర్మాచారి
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీ కె.వి. రామానాయుడు
శ్రీమతి పార్వతీమోహన్
.......................................హారైయినారు



3508
0 కామెంట్‌లు

అనేక సాయంకాలాలు

నెలనెలా వెన్నెల
అనేక సాయంకాలాలు ఆవిష్కరణ















0 కామెంట్‌లు

డిసెంబరు నెలనెలా వెన్నెల Dec 29, 2008

చాలా కాలంగా బ్లాగు సరిగా రాయలేకపోతున్నాను.
చాలా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను. రకరకాల కారణలు.

పుస్తక ప్రదర్శనకని బయలుదేరాను, కానీ వెళ్ళలేకపోయా. చివరికి నెలనెలా వెన్నెలకు హాజరయ్యాను. దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి, న్యూ మారుతి నగర్ లో జరుగుతుంది. ఇదివరలో ఆస్మాన్ ఘడ్‌లో జరిగేది. రోడ్డుకు కొంచెం దగ్గరగావుండేది. అయినా రామచంద్రపురంనుండి వెళ్ళే నాకు దగ్గరేమిటి దూరం ఏమిటి. నేను వెళ్ళే సరికి కొంతమంది అప్పటికే వచ్చివున్నారు. ఒబ్బిని, ధర్మాచారి, నాగార్జున, కె.వి. రామానాయుడు, మొహనరెడ్డి, వారి మిత్రుడు, ప్రార్వతిమోహన్, లలితకుమారి శిలాలోలిత ఇలా.

పలకరింపులు అయ్యాక ఈ మద్య కాలంలో మనల్ని వదిలిపెట్టివెళ్ళిన సాహితీమిత్రుల్ని ఒక్కసారి గుర్తు చెసుకుంటూ మౌనం పాటించారు. ఒబ్బిని తన కవిత్వ పఠనాన్ని ప్రారంబించారు. ఇంతలో ఇంద్ర ప్రసాద్, మరికొద్దిసేపటికి అద్దేపల్లి రామ్మొహన రావు వచ్చారు. అద్దేపల్లి జ్వాలముఖితో వున్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు,

ఎప్పటిలాగే తన శ్రీకాకుళపు మాండలీకంతో విరుపుల, రాజశేఖరీయం అనే గల్పికను చదివి వినిపించారు.

శిలాలోలిత ఈమద్యకాలంలో దూరమౌతున్న సాహితీ మిత్రులను తలపోస్తూ ఏమైపోతున్నారు వీరంతా అంటూనే ......

ఈ మద్య తనకు ఆకాశవాణి జాతీయంగా ఎన్నుకున్న కవితను చదివి వినిపించారు.

వాళ్ళంతా దేహాన్ని విడిచారు
రాలిపడ్డ పూలల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమికరించుకుంటూ
దేహం అశశ్వతమని
అక్షరాల పూలే శాశ్వతమని చేదు గుళికలు మింగుతూ
రూప రహితులైన వారి జ్ఞాపకాలను
చమర్చుతున్న కన్నీళ్ళను అదిమిపడ్తూ ఆర్దత పొలమారుతుంటే
వాళ్ళ అక్షరాల వూత కర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం!

మరోకవితలోని కొన్ని పాదాలు
" బ్రతుకు కంటే స్వేచ్చ గొప్పది
స్వేచ్చంటే బాధను చుట్టుకున్న పొర చేదింపబటమే" అంటారు

మోహన రెడ్డిగారు తనకవితను వినిపించారు.
అద్దేపల్లిగారితో వచ్చిన ఆయన శిష్యుడు స్వియరచనా పాటలని పాడివినిపించారు.

నడిచే పుస్తంకగా మేము పిలుచుకొనే రామనాయుడు కొన్ని కవితలను, దిగంబర కవిత్వంలో తనకు బాగా గుర్తున్న వాక్యాలను వినిపించారు

అన్నా!
నీ గాయాలపైనుండి వీచిన గాలి ఎరుపెక్కింది
నువ్వు ఆసరాచేసుకున్న బొడ్డుమల్లె ఎరుపెక్కింది
నువ్వు పడ్డచోట భూమి కూడా ఎరుపెక్కింది
ఇంకో మాట విన్నావా
నువ్వు కొట్టిన బాణం దెబ్బకు గాలికూడా ఎరుపెక్కింది

ఇక నావంతు వచ్చేసరికి నాదగ్గార నేను రాసినవి ఏమిలేకపోవడంవల్ల, ఈ మద్యకాలంలో నాకు నచ్చిన "పొద్దు" లో వచ్చిన చదరంగం - ఒరెమునా(చావా కిరణ్) అనే కవితను చదివి వినిపించాను.

మరో ఉదయం అస్తమించింది,
రాతిరి చీకటిని తలుచుకుంటూ
కన్నీటి ప్రవాహం సాక్షిగా,
యద రోదన సాక్షిగా,
నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,
నిజ శరీర సాక్షిగా


మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలుచుకుంటూ.
తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,
విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,
అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,
ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,

మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలచుకుంటూ.
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
నవ్వుల జల్లుల సాక్షిగా,
యద కేరింతల సాక్షిగా,
ఆనంద, మాధుర్య, సగర్వ,
సమ్మోహ స్వ శరీర సాక్షిగా



మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,
దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,
సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,
వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,
మరో ఉదయాగమనం.
రాతిరి పరిమళాలతో.

జీవితం ఎప్పుడూ ఇంతే,
ఒక కిటికీలో మోయలేని విషాదం
ఒక కిటికీలో భరించలేని ఆనందం."

ఇక లలితకుమారిగారు బాల సాయిబాబాపై రాసిన భక్తి పద్యాలను వినిపించారు, ముద్రితమైన పుస్తకాన్ని అందరికి పంచారు. చివరిగా అద్దేపల్లి ప్రెష్‌ష్ష్...........
కురగాయలు బహుళ కంపెనీలుగా మారిపోవడన్ని వినిపించారు.

తేనీరు సేవించి అందర్మూ ఒకరికొకరు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ శెలవు తీసుకున్నాము. బహుముఖాలుగా సాగిన ఈ సాహిత్య సాయంకాలం సుమహారంగా మారింది.

నిర్వహించిన సి.వి.కృష్ణారావుగారి మోములో కొత్త నందివర్దనం విరిసింది
........జాన్ హైడే కనుమూరి 3 కామెంట్‌లు

వార్తలో వ్యాసం ౨౮.౮.౨౦౧౧


నెలనెలా వెన్నెల 5 సంకలనం పై వార్తలో వ్యాసం

0 కామెంట్‌లు

జ్వర సంధి ..............మునిపల్లె రాజు

జ్వరం నాకొక వరం
అది నా స్వగతాల స్వరం
జ్వరం నా జనని వడి
సడిచేయని వెచ్చని నది

అనాది స్వప్నాల నక్షత్ర యాత్రలను
దేహంవీడి దైన్యంగా పయనిస్తున్న ఆత్మకు
ఎన్నో పురో భయాల పాంద్రతర చిత్రాలను
రంగులు మారుతున్న ఉష్ణరక్త ప్రస్థానాన్ని

జ్వరసంధిలో తిలకిస్తుంటాను
ఎన్నడూ వినని భాషలో కవితలల్లుతుంటాను

చీలిన పొగమంచు తెరల రధ్యల్లో
జయ జయ మృదంగ నాద నేపధ్యంతో
ఏడుతరాల నా పూర్వికుల దర్శనం
ఆశువుగా ఆశాదుల ఆశః పరంపర
ఆకలి దప్పులు లేని ఆనంద మఠ విశ్రాంతి

జ్వరంలో నాకు సాధ్యం
యోగనిద్రకు అదే నా భాష్యం
......................................................నెలనెలా వెన్నెల-5 సంకలనం నుంచి
2 కామెంట్‌లు

నెలనెలావెన్నెల సమావేశం

నెలనెలావెన్నెల సమావేశం ఆదివారము 31.7.2011 సాయత్రం జరిగింది.

శ్రీ రూప్కుమార్

శ్రీ ధర్మాచారి

శ్రీ కుమార్

శ్రీ బ్రహ్మానందం

శ్రీ కె.వి రామానాయుడు

శ్రీమతి పార్వతీమోహన్ హాజరయ్యారు

శ్రీ సి.వి.కృష్ణారావు గారు అందరిని పరిచయం చేసారు


నాగేశ్వర రావు గారు విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్యుడు.
కొన్ని అనుభవాలను, కొన్ని పద్యాలను పంచుకున్నారు.

ఆందరూ తమ తమ కవితల్ని పఠనం చేసారు.

.......................శ్రీమతి పార్వతీమోహన్
0 కామెంట్‌లు

శేషభట్టర్ రఘు కవిత నెల నెలా వెన్నెల సంకనం-5

తనొక మంత్రదండం - నేనొక పిల్లన గ్రోవి


శేషభట్టర్ రఘు




ఆమె
మందారానికి బంగారం అద్దినట్టు నవ్వుతుంది

అప్పుడు
వెన్నెలకు చిల్లుపడి గదిలోకి రాల్చినట్టుంటుంది

తన మెత్తని పెదాల ఉన్నిచర్మం మంత్రదండంలా
జఢత్వాన్ని చిత్తుచేస్తుంది

ఇక నీటి పక్షుల్లా తిరిగే నా ప్రేమాన్విత మోహాన్ని
ద్రాక్షారస సాయంత్రాన్ని
మనోహర పుష్పంలాంటి తన ఉనికివైపు నడుపుతాను

ఒక ధూమ ప్రతిమనై
తను శ్వాసించే దారుల్ని తాకుతాను

ఏమాటామకామాట విడివిడిగా పేర్చిన
పొడిప్రేమల పలకల్ని విసిరేసి వస్తాను

ఇక కలల కొనలమీద
పిల్లనగ్రోవిలాంటి వాక్యం నేను

నెల నెలా వెన్నెల On Kinige


3193 1 కామెంట్‌లు

వాడ్రేవు చినవీరభద్రుడు కవిత నెలనెలా వెన్నెల అయిదవ సంకలనం నుంచి

అదిలాబాద్ క్రిస్మస్, 2000

......వాడ్రేవు చినవీరభద్రుడు

మళ్ళీ అదేదారి, అదే అడవి
ఒణికిస్తున్న శీతపవనాలు
భువి పైన వేల శుభాకాంక్షలు
క్రిస్మస్ తారలు

విజ్జీ, దగ్గరగా జరుగు, సర్దుకు కూచో
ఈ ఎర్రబస్సులో ఈ గుడిహత్నూర్,
ఈ ధనోర, ఈ ఇంద్రవెల్లి
కట్టుకోవడానికి గుడ్దకు కూడా నోచని
ఆ తల్లులు, ఆ పిల్లలు

విజ్జీ, పయనించాలి మనం
కనీసం ఆరునెలలకొకసారైనా
ఈ అడవిబాటని, వెతుక్కుంటూ
మనని మనం గుర్తుపట్టడానికి

విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత
చెక్‌డాంలు, పత్తిచేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ, దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి

విజ్జీ, ఇది మనవూరు, మన అడవి.

............3127 0 కామెంట్‌లు

అందరకీ ఆహ్వానము - జూన్ నెల సమావేశము

నెలనెలా వెన్నెల

జూన్ నెల సమావేశము

కొన్ని సాహిత్య కబుర్లు
శ్రీ బి. యస్. యం. కుమార్
కవితా తొలిపఠనం

స్వీయ కవితా పఠన

తేదీ. 26.06.2011 ఆదివారము

సాయంకాలం 5.30 గంటల నుండి

స్థలము

శ్రీ సి. వి. కృష్ణా రావు
103, బాబూ టవర్శ్, చైతన్యపురి, హైదరాబాదు.
దూరవాణి 040-24044262
........................3065
0 కామెంట్‌లు

అయితేనేం??


ముకుంద రామారారావు
9908347273

ఒక్కొక్కటిగా
అవయవాల సహాయ నిరాకరణ

అతనికిపుడు వినబడదు
బోలెడన్ని తెలుసుకోవాలని
అణుచుకోలేని ఆరాటం ఎపుడూ

ఎవరెవరో దగ్గరగా వచ్చి
ఏవేవో చెబుతారు

కాస్త నవ్వుతూ
తలూపుతూ
గాలిలో చేయూపుతూ
శ్రద్దగా వింటున్నట్టున్నా
వినబడి వినబడక
తెల్లమొహం వేస్తున్నట్టు
కనపడనీయని చిరునవ్వు

సమాధాల్ని బట్టి
వినబడ్డదో లేదోనన్న అంచనా
అందరిదీ

నిశ్శబ్దంలోనే అతను
అన్నీ మాటాడుతూనే ఉన్నాడని
కాస్సేపూ
పోగొట్టుకున్నదేదో పొందుతూనే ఉన్నాడని
ఎవరికెంత తెలుసు


(ఎందరో కవులకు నెలనెలా వెన్నెలైన సి.వి. కృష్ణారావు గారికి నమస్సు మనస్సుతో)

నెలనెలావెన్నెల 5 సంకలనము నుంచి http://kinige.com/kbook.php?id=141 1 కామెంట్‌లు

అందరకీ ఆహ్వానము


నెలనెలా వెన్నెల

మే నెల సమావేశము

కొన్ని సాహిత్య కబుర్లు

స్వీయ కవితా పఠన


తేదీ. 29.05.2011 ఆదివారము

సాయంకాలం 5.30 గంటల నుండి

స్థలము


శ్రీ సి. వి. కృష్ణా రావు

103, బాబూ టవర్శ్, చైతన్యపురి, హైదరాబాదు.
దూరవాణి 040-24044262

నెలనెలా వెన్నెల -5 సంకలనము
అంతర్జాలములో ఇక్కడ పొందవచ్చు.
http://kinige.com/kbook.php?id=141


------------------------


2917


2 కామెంట్‌లు

వైవిధ్య కవితల సమాహారం




... హరిత

దాదాపు ముప్పయ్యేళ్ళు కిందట "నెలనెలా వెన్నెల" ఆరంభమైంది. కవుల్ని ప్రోత్సహించిన సంస్థ ఇది. ప్రత్యేకించి ఒక నిర్మాణం అంటూ లేకున్నా కవిత్వానికి ఊతమిచ్చిన ఈ సంస్థ ఇదివరలో నాలుగు సంకలనాలు ప్రచురించింది. ఇప్పుడు అయిదో సంకలనం "నెలనెలావెన్నెల" (కవన సంకలనం) శీర్షికన వచ్చింది. వైవిధ్యమైన కవిత్వం ఇందులో కనిపిస్తోంది. భిన్న దృక్పథాలు, భావజాలాలకి చెందినవారి అభివ్యక్తిని ఒకచోట చేర్చడం బావుంది. అందెశ్రీ పాటతో ఆరంభమైన ఈ పుస్తకంలో తెలంగాణా భాషకీ, పలుకుబడికీ తగిన ప్రాతినిధ్యం లభించింది. ప్రముఖులు, వర్ధమాన కవులు, కొత్త కవులు రాసిన కవిత్వంలోని పోకడలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్తమాన సమాజంలోని కల్లోలాలకి కవులు ఏవిధంగా స్పందిస్తున్నారో ఈ పుస్తకం చెబుతుంది. గ్లోబలైజేషన్ తాకిదిపై స్పందన, తెలంగాణా ఉద్యమ ప్రతిద్వనులు, వైయక్తికమైన సంవేదనల సమాహారం ఈ కవితా సంకలనం. ఈ పుస్తకానికి మునిపల్లె రాజు, కె.వి. రామానైడు, సి.వి.కృష్ణారావు, పార్వతిమోహన్, జాన్ హైడ్ కనుమూరి సంపాదకులుగా వ్యవహరించారు. మంచి కవిత్వం చదవాలని తపించేవారికి ఇ పుస్తకం ఓ వరప్రదాయని. నెలనెలావెన్నెల కార్యక్రమాల తీరుతెన్నుల్ని ముందు పేజీల్లో వివరించడం బావుంది. ఈ సంస్థ కృషి, కంట్రిబ్యూషన్ మీద పరిశోధన చేయాలనుకునేవారికి ఉపయుక్తమైన సమాచారమిది.
(వార్త ఆదివారం అనుబంధం 17 ఏప్రిల్ 2011 సౌజన్యంతో) 1 కామెంట్‌లు

మార్చి నెల సమావేశము

నెలనెలా వెన్నెల
మార్చి నెల సమావేశము
27.3.2011, సాయత్రము 5.30 గంటలనుండి.

phone 040 24044262 0 కామెంట్‌లు

వైతరణి

వైతరణి
ఒక్కొక్క నగరం దేహం మీద
మానని రాచపుండులా
వేదన హృదయంలో ఒత్తిగిలక
వెలికి వచ్చిన ఒక చిహ్నంలా
మూలకొక్క మురికిపేట
వేలకొలది జనుల విషాద గాధ

బురదలో పురుగులు మసలినట్లు
ఎన్నడూ మోములెత్తి మిన్నువైపు చూడక
వేడికి ఎండి చలికి స్రుక్కి
గాలికి వాలి తుఫానులో తృళ్లిపడి
ఈబంధన సత్యమని
ఈ బ్రతుకు అనిత్యమని
బాధల మహాభారతంలో
మురికిపేటలో మసలే మూగజీవాలు

గుడిసెల చూరు భూమికి జాగిలపడి
తమ సంపాదన
వేదనతో రోదించే శిశువుల
పెదిమలు తడపజాలని సలిల బిందువులై
రోగాలు వేగంగా మోసుకొచ్చే
క్రిమి కీటకాలు సహగాములై
తమ స్వప్నావస్థలో
కంకాళాలు నింపుకొస్తుంటే
జీవన వ్యాపారం అక్కడా జరుగుతూనే వుంది

స్మశానాలకు చోటు విడమర్చి
భయపడి పక్కకు తొలిగిన హర్మ్యాలు
తమ నగరంలో
సజీవ మానవాస్థిపంజరాలు మసులుతుంటే
ఇంకా ఎటూ కదలటంలేదు

మానవుడు చూడని లోకంలో
ఈ భువినే నిర్మించాలని
చేసే ప్రోద్బలన
ఆకసమంటే హర్మ్యాలు
యమలోకం త్రోవలో వైతరణి
మురికి పేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

వైతరణి ఒడ్డున
బాధకు చిహ్నాలై
సుప్రసిద్ధ గాధలకు నాయకులై
ఒకడు గుహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు
ఒకడు బంధువు


నివాసం = కుటీరంలో - తుఫానులో
ఆశ = ఆరుతూ - వెలుగుతూ
విశ్వాసం = వికసిస్తూ - హ్రస్వమౌతూ
ఓర్పు = ఘనీభవిస్తూ - ఆవిరౌతూ
బ్రతుకు = దు:ఖంలో - నిర్వీర్యతలో.



(వైతరణి - కావ్యం 1968 ఫ్రీవర్స్ ఫ్రంట్‌ ప్రచురణ నుండి)



2744 1 కామెంట్‌లు