RSS

అయితేనేం??


ముకుంద రామారారావు
9908347273

ఒక్కొక్కటిగా
అవయవాల సహాయ నిరాకరణ

అతనికిపుడు వినబడదు
బోలెడన్ని తెలుసుకోవాలని
అణుచుకోలేని ఆరాటం ఎపుడూ

ఎవరెవరో దగ్గరగా వచ్చి
ఏవేవో చెబుతారు

కాస్త నవ్వుతూ
తలూపుతూ
గాలిలో చేయూపుతూ
శ్రద్దగా వింటున్నట్టున్నా
వినబడి వినబడక
తెల్లమొహం వేస్తున్నట్టు
కనపడనీయని చిరునవ్వు

సమాధాల్ని బట్టి
వినబడ్డదో లేదోనన్న అంచనా
అందరిదీ

నిశ్శబ్దంలోనే అతను
అన్నీ మాటాడుతూనే ఉన్నాడని
కాస్సేపూ
పోగొట్టుకున్నదేదో పొందుతూనే ఉన్నాడని
ఎవరికెంత తెలుసు


(ఎందరో కవులకు నెలనెలా వెన్నెలైన సి.వి. కృష్ణారావు గారికి నమస్సు మనస్సుతో)

నెలనెలావెన్నెల 5 సంకలనము నుంచి http://kinige.com/kbook.php?id=141

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కృష్ణారావు గారి ఉన్నతమయిన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టిన మంచి కవిత ఇది. ముకుంద రామారావు గారికి అభినందనలు. వెన్నెల మిత్రులందరికీ అభినందనలు. నెలా నెలా వెన్నెల వారసత్వం పది కాలాలు నిలవాలని కోరుకుంటూ... Afsar