తనొక మంత్రదండం - నేనొక పిల్లన గ్రోవి
శేషభట్టర్ రఘు
ఆమె
మందారానికి బంగారం అద్దినట్టు నవ్వుతుంది
అప్పుడు
వెన్నెలకు చిల్లుపడి గదిలోకి రాల్చినట్టుంటుంది
తన మెత్తని పెదాల ఉన్నిచర్మం మంత్రదండంలా
జఢత్వాన్ని చిత్తుచేస్తుంది
ఇక నీటి పక్షుల్లా తిరిగే నా ప్రేమాన్విత మోహాన్ని
ద్రాక్షారస సాయంత్రాన్ని
మనోహర పుష్పంలాంటి తన ఉనికివైపు నడుపుతాను
ఒక ధూమ ప్రతిమనై
తను శ్వాసించే దారుల్ని తాకుతాను
ఏమాటామకామాట విడివిడిగా పేర్చిన
పొడిప్రేమల పలకల్ని విసిరేసి వస్తాను
ఇక కలల కొనలమీద
పిల్లనగ్రోవిలాంటి వాక్యం నేను
నెల నెలా వెన్నెల On Kinige
3193
1 కామెంట్‌లు
శేషభట్టర్ రఘు కవిత నెల నెలా వెన్నెల సంకనం-5
లేబుళ్లు: కవితలు, కవిత్వం, నెలనెలా వెన్నెల, సి.వి కృష్ణారావువాడ్రేవు చినవీరభద్రుడు కవిత నెలనెలా వెన్నెల అయిదవ సంకలనం నుంచి
లేబుళ్లు: కవితలు, నెలనెలా వెన్నెల, సాహిత్యం, సి.వి కృష్ణారావు
అదిలాబాద్ క్రిస్మస్, 2000
......వాడ్రేవు చినవీరభద్రుడు
మళ్ళీ అదేదారి, అదే అడవి
ఒణికిస్తున్న శీతపవనాలు
భువి పైన వేల శుభాకాంక్షలు
క్రిస్మస్ తారలు
విజ్జీ, దగ్గరగా జరుగు, సర్దుకు కూచో
ఈ ఎర్రబస్సులో ఈ గుడిహత్నూర్,
ఈ ధనోర, ఈ ఇంద్రవెల్లి
కట్టుకోవడానికి గుడ్దకు కూడా నోచని
ఆ తల్లులు, ఆ పిల్లలు
విజ్జీ, పయనించాలి మనం
కనీసం ఆరునెలలకొకసారైనా
ఈ అడవిబాటని, వెతుక్కుంటూ
మనని మనం గుర్తుపట్టడానికి
విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత
చెక్‌డాంలు, పత్తిచేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ, దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి
విజ్జీ, ఇది మనవూరు, మన అడవి.
............3127 0 కామెంట్‌లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, జులై 06, 2011
......వాడ్రేవు చినవీరభద్రుడు
మళ్ళీ అదేదారి, అదే అడవి
ఒణికిస్తున్న శీతపవనాలు
భువి పైన వేల శుభాకాంక్షలు
క్రిస్మస్ తారలు
విజ్జీ, దగ్గరగా జరుగు, సర్దుకు కూచో
ఈ ఎర్రబస్సులో ఈ గుడిహత్నూర్,
ఈ ధనోర, ఈ ఇంద్రవెల్లి
కట్టుకోవడానికి గుడ్దకు కూడా నోచని
ఆ తల్లులు, ఆ పిల్లలు
విజ్జీ, పయనించాలి మనం
కనీసం ఆరునెలలకొకసారైనా
ఈ అడవిబాటని, వెతుక్కుంటూ
మనని మనం గుర్తుపట్టడానికి
విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత
చెక్‌డాంలు, పత్తిచేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ, దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి
విజ్జీ, ఇది మనవూరు, మన అడవి.
............3127 0 కామెంట్‌లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, జులై 06, 2011
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)