జన్మ కే జన్మ నిచ్చు స్త్రీజన్మ ధన్యము
గురువుకే తొలి గురువు నీకు అభినందనలు
దాసివై మగవాడిని మహరాజు చేసినా
మంత్రివై ఆ రాజు కు సూక్ష్మ ఙ్ఞానము నేర్పినా
వెల కట్టలేని ఆలి వై ఆనందాలు పంచినా
కడుపు లోని మానవ జాతిని మోసి జాతినే అమరం చేసినా
ఊయల ఊపి జగతినేలే నాయకులని పెంచినా
ఓర్పు,నేర్పు, సహన చాతుర్యాలతో అబలవైనా సబలవై లోకాలనేలినా
నీకు నువ్వే మేటి,లేదు నీ జన్మకు సాటి
మగవాడిలో సగమైనా ఆడదానిగా నీ స్రుష్టి అపూర్వము
జన్మ జన్మల వారది మానవజాతి సారధి
బరువైన బాధ్యలతో నీ జన్మ మానవాళికి నివాళి
కష్టాలు,కన్నీళ్ళు,వేధింపులు,సా ధింపులు
కాకూడదు అవరోధము నీ జన్మ సార్ధకతకు
నిన్ను నువ్వు తెలుసుకొ,నీ విలువ పెంచుకో
తలబడి నిలబడి నీ జాతిని రక్షించుకో!
మహిళా దినోత్సవం సంధర్భంగా నాకు తోచిన నాలుగు మాటలు