RSS

అయితేనేం??


ముకుంద రామారారావు
9908347273

ఒక్కొక్కటిగా
అవయవాల సహాయ నిరాకరణ

అతనికిపుడు వినబడదు
బోలెడన్ని తెలుసుకోవాలని
అణుచుకోలేని ఆరాటం ఎపుడూ

ఎవరెవరో దగ్గరగా వచ్చి
ఏవేవో చెబుతారు

కాస్త నవ్వుతూ
తలూపుతూ
గాలిలో చేయూపుతూ
శ్రద్దగా వింటున్నట్టున్నా
వినబడి వినబడక
తెల్లమొహం వేస్తున్నట్టు
కనపడనీయని చిరునవ్వు

సమాధాల్ని బట్టి
వినబడ్డదో లేదోనన్న అంచనా
అందరిదీ

నిశ్శబ్దంలోనే అతను
అన్నీ మాటాడుతూనే ఉన్నాడని
కాస్సేపూ
పోగొట్టుకున్నదేదో పొందుతూనే ఉన్నాడని
ఎవరికెంత తెలుసు


(ఎందరో కవులకు నెలనెలా వెన్నెలైన సి.వి. కృష్ణారావు గారికి నమస్సు మనస్సుతో)

నెలనెలావెన్నెల 5 సంకలనము నుంచి http://kinige.com/kbook.php?id=141 1 కామెంట్‌లు

అందరకీ ఆహ్వానము


నెలనెలా వెన్నెల

మే నెల సమావేశము

కొన్ని సాహిత్య కబుర్లు

స్వీయ కవితా పఠన


తేదీ. 29.05.2011 ఆదివారము

సాయంకాలం 5.30 గంటల నుండి

స్థలము


శ్రీ సి. వి. కృష్ణా రావు

103, బాబూ టవర్శ్, చైతన్యపురి, హైదరాబాదు.
దూరవాణి 040-24044262

నెలనెలా వెన్నెల -5 సంకలనము
అంతర్జాలములో ఇక్కడ పొందవచ్చు.
http://kinige.com/kbook.php?id=141


------------------------


2917


2 కామెంట్‌లు

వైవిధ్య కవితల సమాహారం




... హరిత

దాదాపు ముప్పయ్యేళ్ళు కిందట "నెలనెలా వెన్నెల" ఆరంభమైంది. కవుల్ని ప్రోత్సహించిన సంస్థ ఇది. ప్రత్యేకించి ఒక నిర్మాణం అంటూ లేకున్నా కవిత్వానికి ఊతమిచ్చిన ఈ సంస్థ ఇదివరలో నాలుగు సంకలనాలు ప్రచురించింది. ఇప్పుడు అయిదో సంకలనం "నెలనెలావెన్నెల" (కవన సంకలనం) శీర్షికన వచ్చింది. వైవిధ్యమైన కవిత్వం ఇందులో కనిపిస్తోంది. భిన్న దృక్పథాలు, భావజాలాలకి చెందినవారి అభివ్యక్తిని ఒకచోట చేర్చడం బావుంది. అందెశ్రీ పాటతో ఆరంభమైన ఈ పుస్తకంలో తెలంగాణా భాషకీ, పలుకుబడికీ తగిన ప్రాతినిధ్యం లభించింది. ప్రముఖులు, వర్ధమాన కవులు, కొత్త కవులు రాసిన కవిత్వంలోని పోకడలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్తమాన సమాజంలోని కల్లోలాలకి కవులు ఏవిధంగా స్పందిస్తున్నారో ఈ పుస్తకం చెబుతుంది. గ్లోబలైజేషన్ తాకిదిపై స్పందన, తెలంగాణా ఉద్యమ ప్రతిద్వనులు, వైయక్తికమైన సంవేదనల సమాహారం ఈ కవితా సంకలనం. ఈ పుస్తకానికి మునిపల్లె రాజు, కె.వి. రామానైడు, సి.వి.కృష్ణారావు, పార్వతిమోహన్, జాన్ హైడ్ కనుమూరి సంపాదకులుగా వ్యవహరించారు. మంచి కవిత్వం చదవాలని తపించేవారికి ఇ పుస్తకం ఓ వరప్రదాయని. నెలనెలావెన్నెల కార్యక్రమాల తీరుతెన్నుల్ని ముందు పేజీల్లో వివరించడం బావుంది. ఈ సంస్థ కృషి, కంట్రిబ్యూషన్ మీద పరిశోధన చేయాలనుకునేవారికి ఉపయుక్తమైన సమాచారమిది.
(వార్త ఆదివారం అనుబంధం 17 ఏప్రిల్ 2011 సౌజన్యంతో) 1 కామెంట్‌లు