అగ్రగామి అంబేద్కర్
లేబుళ్లు: కవితలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుపుడమితల్లికి పురుడుపోసి
గోమాత పొదుగు కడిగి
ఇంటికప్పుకు రెల్లుకప్పి
డొక్కకు రెక్కలు కలిపిన
స్పర్శకు అస్పృశ్యత ఫలసాయం
విస్తరి నుండి ఊడిన ఆకులా ?
నావ్ కుదురు నుంచి విరిగిన బద్దలా ?
పాలపుంత నుంచి రాలిన చుక్కలా ?
"ఏడవకు
బైటికిరా,
రాజ్యాలేలంటే
కళ్ళప్పగించి ఏం లాభం ?
పద ఐదో తమ్ముడిగా కాదు
అగ్రగామిగా"
అదుగో
ఎవరో వెల్తురు మోసుకుంటూ వస్తున్నారు
వెలుగు తన కక్కర్లేదా ఏం?
జన సమూహానికి దారి చూపుతున్నాడు
ఆయనే అగ్రగామిగా ఉండి
అవస్థల వ్యవస్థలు దాటుతూ...
ఇంకా సిద్దించని కోర్కల బి.ఆర్. అంబేద్కర్
సివి. కృష్ణారావు ..... అవిశ్రాంతం నుంచి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
చెట్లు లేని చోట మహా వృక్షం మన అంబేత్కర్ :)
అజ్ఞాత
మీరు ఆడో మొగో తెలియదు, పేరూ లేదు
మీ కామెంటును ఎలా స్వీకరించాలంటారు??
ఎలా రాశానో అలాగే స్వీకరించండి. అందులో భావం మీకర్థం అయిందని నాకు తెలుసు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి